భారత్ సమాచార్, సినీ టాక్స్ : హాట్ బ్యూటీ సన్నీలియోన్ కు ఉన్నంత పాపులారిటీ యూత్ లో ఏ సూపర్ స్టార్, మెగాస్టార్ లకు తీసిపోదనే విషయం అందరికి తెలిసిందే. దశాబ్దకాలంగా యువకుల కలల రాణిగా వారి మదిని దోచేస్తునే ఉంది ఈ నీలి చిత్రాల తార. సన్నీలియోన్ అందాల సుడిలో కొట్టుకుపోని వారు ఉండరంటే.. ఉండరనే చెప్పచ్చు అని అంటారు నేటి తరం నెటిజన్లు. అయితే పైకి గ్లామర్ డాల్ గా కనిపించినా… ఆమె హృదయం మాత్రం చాలా సున్నితమే. ఆమెలో గొప్ప దాతృత్వ గుణం ఉన్నట్టు ఆమె చేసే యాక్టివిటీస్ ను బట్టి తెలుస్తుంది. అప్పుడప్పుడూ ఆమె తన సీక్రెట్స్ ను కూడా చెప్పేస్తూ ఆడియన్స్ ను అలరిస్తుంటూ మరింతగా పాపులర్ అవుతూ ఉంటుంది.
ఈ సెక్సీ డాల్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన సోషల్ మీడియా ఎకౌంట్ సీక్రెట్స్ ను ప్లో లో చెప్పేసింది. అందరికీ తెలిసిన ఇన్ స్టా, ట్విటర్ వెరిఫైడ్ ఎకౌంట్ ద్వారా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ మ్యాటర్స్ షేర్ చేసుకుంటున్న సన్నీ.. ప్రైవేట్ ఎకౌంట్స్ కూడా మేనేజ్ చేస్తున్నానని చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న విషయాలపై నచ్చిన విధంగా పోస్టు పెట్టడానికి, ఇతరులకు పోస్టు పెట్టడానికి వాటిని ఉపయోగిస్తున్నానంటోంది. ఇంకా మీ ఫోన్ లో ఎలాంటి నాటీ ఫొటోలు ఉంటాయని అడిగిన ప్రశ్నకు.. అలాంటివేవీ ఉండవని తెలిపింది. పోర్న్ సినిమాలకు గుడ్ బై చెప్పి బాలీవుడ్ కు షిఫ్ట్ అయిన సన్నీ లియోన్ వెండితెరపై ఇక్కడి సినీ ప్రేమికులను తన అందంతో, నటనతో చాలా బాగా ఆకట్టుకుంటోంది. టీవీ షోలు, ఇంటర్వ్యూ లు, అడపదడపా సినిమాలు చేస్తూ యూత్ ను కవ్విస్తూ మెప్పిస్తోంది. అప్పుడప్పుడు టాలీవుడ్ లో కూడా ప్రత్యేక గీతాల్లో కనిపిస్తూ కుర్రకారును కవ్విస్తోంది. ఇక మీదట బాలీవుడ్ తో పాటుగా సౌత్ లో కూడా సనిమాలు చేయటానికి ఆసక్తిగా ఉన్నానని వెల్లడించింది ఈ కెనడా హాట్ బ్యూటీ.