భారత్ సమాచార్.నెట్,హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల(MLA Disqualification Case) పై సుప్రీంకోర్టు (Supreme Court)లో ఇవాళ విచారణ జరిగింది. జస్టిస్ గవాయ్ (Justice Gavai) నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా అంటూ వ్యాఖ్యానించింది. రాజ్యాంగ ధర్మాసనాల పూర్వపు తీర్పులు ఉన్నప్పటికీ.. ఈ వ్యవహారాల్లో ఎప్పటిలోగా తేల్చాలనే విషయంలో గత తీర్పులు స్పష్టంగా చెప్పలేదన్నారు. అలాంటప్పుడు ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలమని ప్రశ్నించింది.
చర్యలు తీసుకోవడానికి ఇంకా ఎంత సమయం ఇవ్వాలి.. ఇంకా ఎన్ని రోజులు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు మండిపడింది. ఈ అంశంలో మొదటి ఫిర్యాదు ఇచ్చిన నాటి నుంచి నేటీ వరకు ఎంత సమయం గడిచిందని ప్రశ్నించింది. నిర్ణయం తీసుకోవడానికి తగిన సమయం అంటూ ఉండాలి కదా అని వ్యాఖ్యానించింది. ఫిర్యాదు వచ్చి ఎన్ని రోజులు అవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. కాలయాపన చేసే విధానలు మానుకోవాలని సూచించింది. ఎమ్మెల్యేల పదవీకాలం పూర్తయ్యేవరకు కాలయాపన చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
ఇకపోతే బీఆర్ఎస్ తరఫున లాయర్ సుందరం, శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి అధికారం ఉందని కాంగ్రెస్ పార్టీలో చేరారని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదన్నారు. ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంపై అసెంబ్లీ కార్యదర్శి స్పీకర్ తరుఫున కౌంటర్ దాఖలు చేశారు. అందులో పిటిషన్‌ర్లు తప్పుడు ఉద్దేశంతో ఈ పిటిషన్ వేశారని.. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే కోర్టును ఆశ్రయించారని తెలిపారు. ఈ పిటిషన్లను కొట్టివేయాలని అసెంబ్ల కార్యదర్శి కౌంటర్ చేసిన దాఖల్లో కోరారు.