భారత్ సమాచార్.నెట్: ఇండియాస్ గాట్ లాటెంట్ షో (India’s Got Latent) లో యూట్యాబర్ (Youtuber) రణవీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) తల్లిదండ్రులుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన కేసుపై దర్యాప్తు జరుగుతూనే ఉంది. అయితే అతడి పాస్‌పోర్టును అప్పగించేందుకు సుప్రీంకోర్టు (Supremecourt) నిరాకరించింది. ఈ కేసులు దర్యాప్తు ముగిసిన తర్వాతే పాస్‌పోర్ట్ రిలీజ్ చేయాలనే పిటిషన్‌ను పరిశీలిస్తామని స్పష్టం చేసింది. అలాగే ముంబై, గువాహటి, జైపుర్‌లో అతడిపై నమోదైన కేసులపై అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పొడిగించింది.
అయితే పోలీసులకు తన పాస్‌పోర్టును అప్పగించాలని గతంలో కోర్టు చేసిన ఆదేశాలను సవరించాలని కోరుతూ రణ్‌వీర్ కోర్టును ఆశ్రయించారు. ఇకపై తన షోలల్లో అసభ్య వ్యాఖలు చేయనని.. బాధ్యతగా నడుచుకుంటానని హామీ ఇచ్చారు. తనవద్ద పాస్‌పోర్టు లేకపోవడం వల్ల విదేశాలకు వెళ్లలేకపోతున్నామని.. ఇది తన జీవనోపాధిపై ప్రభావం చూపుతుందని తన పిటిషన్‌లో రణవీర్ అల్హాబాదియా పేర్కొన్నారు. దీనిపై తాజాగా విచారించిన సుప్రీంకోర్టు పాస్‌పోర్టు ఇచ్చేందుకు నిరాకరించింది.
ఇకపోతే ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో పాల్గొన్న రణ్‌వీర్ అల్హాబాదియా.. షోలోని ఒకరు తల్లిదండ్రుల శృంగారంపై ప్రశ్నించిన వివాదాల్లో చిక్కుకున్నాడు. ఇందుకు సంబంధించిన వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరలవ్వడంతో మహారాష్ట్ర సైబర్ విభాగం ఈ షో సభ్యులపై కేసు నమోదు చేసింది. మిగతా చోట్ల కూడా రణ్‌వీర్‌పై కేసులు నమోదయ్యాయి. దీంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం కూడా మొట్టికాయాలు వేసింది. పాపులారిటీ ఉన్నంత మాత్రానా ఏది పడితే అది మాట్లాడటాన్ని సమాజం అనుమతించదని పేర్కొన్న న్యాయస్థానం.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఎలాంటి షోలు చేయవద్దని స్పష్టం చేసింది.