Homebreaking updates newsSupremecourt: కంచ గచ్చిబౌలి భూముల్లోని చెట్ల నరికివేతపై సుప్రీం ఆగ్రహం

Supremecourt: కంచ గచ్చిబౌలి భూముల్లోని చెట్ల నరికివేతపై సుప్రీం ఆగ్రహం

భారత్ సమాచార్.నెట్, న్యూఢిల్లీ: హైదరాబాద్ (Hyderabad) కంచ గచ్చిబౌలి (Gachibowli) భూముల (Lands) వ్యవహారంపై సుప్రీంకోర్టు (Supremecourt)లో రేవంత్ ప్రభుత్వానికి (Revanth Govt) ఎదురుదెబ్బ తగిలింది. సెంట్రల్ యూనివర్సిటీ దగ్గరున్న భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు తీసుకోకుండా చెట్లను కొట్టివేసినట్లు తేలితే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సహా సంబంధిత అధికారులు అందరినీ జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం బుధవారం ఈ వివాదంపై విచారణ జరిపింది.

చెట్లు కొట్టేసేముందు 1996 సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం అనుమతులు తీసుకున్నారా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. రాష్ట్రప్రభుత్వం తరఫున వాదించిన అభిషేక్ మను సింఘ్వీ.. అన్ని అనుమతులతోనే జామాయిల్ తరహా చెట్లు, పొదలను తొలగించారని కోర్టుకు చెప్పారు. అనుమతులు తీసుకోకుండా చెట్లు నరికారని తేలితే రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా సంబంధిత అధికారులు అందరూ జైలుకు వెళ్ళవలసి వస్తుందని న్యాయమూర్తి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వారంతపు సెలవుల్లో మూడు రోజుల్లో చెట్లు కొట్టాల్సిన తొందర ఎందుకొచ్చిందని ప్రశ్నించింది.
మీరు చెట్లు కొట్టడం వల్ల అక్కడ జంతువుల మీద కుక్కలు దాడి చేస్తున్నాయని.. ఆ వీడియోలను చూసి ఆందోళనకు గురయ్యానట్లు సుప్రీంకోర్టు తెలిపింది. పర్యావరణ పరిరక్షణలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అవసరమైతే 2400 ఎకరాల్లో ఒక్క చెట్టు కూడా కొట్టకుండా ఆదేశాలివ్వాల్సి వస్తుందని జస్టిస్ గవాయి తెలిపారు. సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. దీనిపై నాలుగు వారాల్లో ప్రణాళిక సిద్ధం చేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది సుప్రీంకోర్టు. వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యవహారంపై యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది.
RELATED ARTICLES

Most Popular

Recent Comments