Homebreaking updates newsమహిళల భద్రత కోసం T-SAFE యాప్

మహిళల భద్రత కోసం T-SAFE యాప్

భారత్ సమాచార్, రాజకీయం : స్త్రీల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు సీఎం రేవంత్ నేడు హైదరాబాద్ లో తెలిపారు. వారి భద్రత కోసం, ప్రత్యేకంగా వారి ప్రయాణాలను మాత్రమే పర్యవేక్షించడానికి వీలుగా ప్రత్యేక సేవలను అందించే T-SAFE యాప్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సచివాలయంలో అధికారికంగా ప్రారంభించారు. T-SAFE పై ప్రజల్లో చైతన్యం కల్పించడానికి తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం రూపొందించిన పోస్టర్‌ను కూడా సీఎం ఆవిష్కరించారు.

మహిళలు ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే సందర్భాల్లో తమ భద్రతకు తక్షణ సహాయం అందించడానికి, లైవ్‌ లొకేషన్‌ షేర్ చేయడానికి, ప్రయాణమార్గం నావిగేట్‌ చేయడానికి, ఆకస్మిక మార్పులు జరిగినప్పుడు పసిగట్టి పోలీసులు అప్రమత్తం కావడానికి వంటి వీలైన అనేక ప్రత్యేక ఫీచర్లతో T-SAFE యాప్‌ రూపొందించినట్టు పోలీసులు మహిళలకి వివరించారు. రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్క మహిళ కూడా వెంటనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని వినియోగించాలని పోలీసులు సూచించారు.

మరికొన్ని విశేషాలు…

కేటీఆర్ కు ధీటైన ఐటీ మంత్రి వస్తారా?

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments