భారత్ సమాచార్.నెట్, తెలంగాణ: తెలంగాణ శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-26ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో రెవన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ. 36,504 కోట్లుగా ఉంది. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క ప్రసంగిస్తూ.. తెలంగాణ ప్రజలు తమను నమ్మి అధికారం ఇచ్చారని, వారికి జవాబుదారీతనంగా ఉంటూ పాలన సాగిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు. తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామని పేర్కొన్నారు. కొందరు ప్రభుత్వం దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకుంటున్నామని, విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. అన్నదాతల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని వివరించారు.
బడ్జెట్ కేటాయింపులు ఇలా..
పంచాయతీరాజ్ శాఖ- రూ.31,605 కోట్లు
వ్యవసాయశాఖ- రూ.24,439 కోట్లు
విద్యాశాఖ- రూ.23,108కోట్లు
మహిళా శిశుసంక్షేమశాఖ- రూ.2,862 కోట్లు
పశు సంవర్థకశాఖ- రూ.1,674 కోట్లు
పౌరసరఫరాల శాఖ- రూ.5,734కోట్లు
కార్మికశాఖ- రూ.900 కోట్లు
ఎస్సీ సంక్షేమం: రూ40,232 కోట్లు
ఎస్టీ సంక్షేమం- రూ.17,169 కోట్లు
బీసీ సంక్షేమం- 11,405 కోట్లు
చేనేత రంగానికి- రూ.371 కోట్లు
మైనార్టీ సంక్షేమశాఖ- రూ.3,591 కోట్లు
పరిశ్రమలశాఖ- రూ.3,527 కోట్లు
ఐటీ రంగం- రూ. 774 కోట్లు
విద్యుత్ రంగం- రూ.21,221 కోట్లు
వైద్య రంగం- రూ.12,393 కోట్లు
పురపాలక రంగం- రూ.17,677 కోట్లు
నీటి పారుదలశాఖ- రూ.23,373 కోట్లు
రోడ్లు, భవనాల శాఖ- రూ.5,907 కోట్లు
పర్యాటక రంగం- రూ.775 కోట్లు
క్రీడలు- రూ.465 కోట్లు
అటవీ, పర్యావరణం- రూ.1,023 కోట్లు
దేవాదాయశాఖ- రూ.190 కోట్లు
ఆరు గ్యారంటీలు- రూ.56,084 కోట్లు
రైతు భరోసా- రూ.18వేల కోట్లు
చేయూత పింఛన్లు రూ.14,861 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లు రూ.12,571 కోట్లు
మహాలక్ష్మి పథకానికి రూ.4,305 కోట్లు
గృహజ్యోతి- రూ.2,080 కోట్లు
సన్నాలకు బోనస్ రూ.1,800 కోట్లు
రాజీవ్ ఆరోగ్యశ్రీ- రూ. 1143 కోటు
గ్యాస్ సిలిండర్ రాయితీ- రూ.723 కోట్లు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా- రూ.600 కోట్లు
రాజీవ్ యువ వికాసం- రూ.6వేలకోట్లు
ప్యూచర్ సిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు