భారత్ సమాచార్, హైదరాబాద్ ;
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు డీఎస్సీ -2024 ఫలితాలను విడుదల చేశారు. డిఎస్సీ ఫలితాలను నేడు విడుదల చేయటం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. డిఎస్సీ ప్రకటించిన కేవలం 56 రోజుల్లో ఈ భారీ ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. పరీక్షల ఫలితాలలో విజయం సాధించిన అభ్యర్థులందరికీ అభినందనలు తెలిపారు. ఉద్యోగ ఖాళీల భర్తీ విషయంలో యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని తెలిపారు. ఎటువంటి వివాదాలు లేకుండా…అత్యంత పారదర్శకంగా పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
పేదలకు విద్యను అందించే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లు నిర్మిస్తున్నామన్నారు. దశాబ్దాల నుంచి తెలంగాణలో విద్య, ఉద్యోగం అంటే ఒక ఉద్వేగ పూరిత భావోద్వేగం ఉన్నాయన్నారు. ఆ భావోద్వేగాలను ప్రజా ప్రభుత్వం గౌరవించి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామన్నారు. అభ్యర్థులు ఫలితాలను అధికారికి వెబ్ సైట్స్ నుంచి తెలుసుకోవచ్చు.
మీ కోసం మరికొన్ని వార్తా విశేషాలు…