హైదరాబాద్, భారత్ సమాచార్.నెట్: విద్యార్థి సంఘాల ఆందోళనతో జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య ధియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ విద్యార్థి సంఘాల నాయకులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి రూ.1కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
రూ.1కోటి పరిహారం ఇవ్వాలి:
నిరసనకారులు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించడంతో అక్కడ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకుంది. ఆయన నివాసం ముందు ఓయూ జేఏసీ నాయకులు నిరసనకు దిగారు. ఇంట్లోకి వెళ్లి పూలకుండీలు పగులగొట్టారు. జేఏసీ నేతలను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకుంది. ఇంట్లోని కాంపౌండ్ వాల్ ఎక్కి అల్లు అర్జున్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి రూ.1కోటి పరిహారం ఇవ్వాల్సిందేనని, అల్లు అర్జున్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను అరెస్ట్ చేశారు.