Homebreaking updates newsJRO Jobs: జేఆర్వో జాబ్స్.. ఎవరు అర్హులంటే ?

JRO Jobs: జేఆర్వో జాబ్స్.. ఎవరు అర్హులంటే ?

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు, ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండేలా ‘జూనియర్‌ రెవెన్యూ అధికారి (జేఆర్వో)’ పేరిట పోస్టులను భర్తీ చేయనుంది. రాష్ట్రంలో మొత్తం 10,911 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించనుంది. ఈ పోస్టుల భర్తీకి గతంలో వీఆర్వోలు, వీఆర్‌ఏలుగా పనిచేసి, ఇతర శాఖల్లోకి మార్చిన వారి నుంచి ఆప్షన్లు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో వీఆర్వో వ్యవస్థ రద్దుకు ముందు ఆ పోస్టుల్లో పనిచేసినవారు, వీఆర్‌ఏలుగా పనిచేస్తూ వివిధ శాఖల్లోకి పంపిన వారికి ఈ నియామకాల్లో ప్రాధాన్యత ఉంటుంది. డిగ్రీ అర్హత కలిగిన మాజీ వీఆర్వో, వీఆర్‌ఏలను నేరుగా ఈ పోస్టుల కోసం రెవెన్యూ శాఖలోకి తీసుకోనున్నారు.

మ్యాథ్స్ ఉన్నవారికి డైరెక్టుగా తీసుకునే అవకాశం:
తెలంగాణ రాష్ట్రంలో 3,600 మంది మాజీ వీఆర్వోలు, 2,000 మంది వరకు మాజీ వీఆర్‌ఏలకు అర్హత ఉన్నట్టు తేలింది. మిగతా సుమారు 5,300 పోస్టులను ఏ విధంగా భర్తీ చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇంటర్‌ పూర్తిచేసిన వారు, ముఖ్యంగా ఇంటర్మీడియట్‌లో గణిత శాస్త్రం చదివిన వారిని కూడా నేరుగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు వీరిలో కొందరిని సర్వేయర్లుగా నియమించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇంటర్‌ పూర్తి చేసిన మాజీ వీఆర్వోలు, వీఆర్‌ఏలను సర్వేయర్లుగా నియమించే అవకాశం ఉంది. ఇలా నేరుగా భర్తీ చేసే జూనియర్‌ రెవెన్యూ అధికారి, సర్వేయర్‌ పోస్టుల్లో మిగిలిన వాటిని రాతపరీక్ష నిర్వహించి భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. అయితే ఈ పోస్టుల్లో చేరేందుకు మాజీ వీఆర్వోలు, వీఆర్‌ఏలు సుముఖత వ్యక్తం చేస్తేనే వారినే జూనియర్‌ రెవెన్యూ అధికారులుగా నియమించనున్నారు.

 

మరిన్ని కథనాలు:

TGEAPCET జనవరిలో షెడ్యూల్‌ విడుదల

RELATED ARTICLES

Most Popular

Recent Comments