భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్ 2025 పరీక్షలను మే మొదటి వారంలో నిర్వహించనున్నట్లు సమాచారం. ఇంజినీరింగ్ పరీక్షలు మూడు రోజులు, ఫార్మసీ, అగ్రికల్చర్ పరీక్షలను మరో రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇక ఈ సారి కూడా ఈఏపీసెట్ 2025 నిర్వహణ బాధ్యతలను జేఎన్టీయూకే అప్పగించారు. ఈ మేరకు జేఎన్టీయూ ప్రొఫెసర్ డీన్ కుమార్‌ను ఈఏపీసెట్ 2025 పరీక్ష కన్వీనర్‌గా ఉన్నత విద్యామండలి నియమించింది. దీంతో ఈఏపీసెట్‌కు సంబంధించిన మొత్తం కసరత్తు పూర్తైంది. ఇక పరీక్షల షెడ్యూల్ మాత్రమే విడుదల చేయాల్సి ఉంది. త్వరలోనే పరీక్షా తేదీలను కూడా ఖరారు చేసి, పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. ఈ షెడ్యూల్ జనవరిలో వచ్చే అవకాశం ఉంది.
TGEAPCET జనవరిలో షెడ్యూల్ విడుదల
RELATED ARTICLES