భారత్ సమాచార్, సినీ టాక్స్ ;
విభిన్నమైన పాత్రలు చేసే కథానాయకుడు ‘చియాన్’ విక్రమ్. వైవిధ్యభరితమైన చిత్రాలు చేసే దర్శకుడు పా రంజిత్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందించిన తాజా చిత్రం ‘తంగలాన్’. వీరి కారణంగా సినీ ప్రేమికుల్లో ఈ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను నెట్టింట విడుదల చేశారు.
బ్రిటిష్ ఇండియా పరిపాలనలో ఓ బ్రిటిష్ అధికారి బంగారం కోసం ఒక తెగ సాయంతో అన్వేషణ సాగించటమే ఈ చిత్రం కథ. ప్రచార చిత్రం ఆసాంతం ఆసక్తికరంగా సాగింది. ఇప్పటికే నటనలో నేషనల్ అవార్డ్ సాధించిన విక్రమ్ నటన ఇందులో హైలెట్ గా నిలిచింది. విక్రమ్ నటన్ మిగిలిన క్రాప్ట్ లను డామినేట్ చేస్తోంది అంటే అతిశయోక్తి కాదు. పా రంజిత్ టేకింగ్ చాలా అద్భుతంగా ఉంది. ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచేసింది. ఒకే కేటగిరి కి చెందిన సినిమాలని చేస్తుంటాడు పా రంజిత్. ఈ మూవీ కూడా ఈ కోవాలోనే రూపొందించాడు. ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీ వి ప్రకాశ్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. విక్రమ్ చెప్పే డైలాగ్ ‘‘చావుని ఎదురించే వాళ్లకి మాత్రమే ఇక్కడ జీవితం ’’ ట్రైలర్ కి హైలెట్ గా నిలిచింది. ప్రకాశ్ మంచి బీజీఎం ని అందించాడు. ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.