Homemain slidesప్రభాస్- అనుష్క పెళ్లి అందుకే ఆగిపోయిందట!

ప్రభాస్- అనుష్క పెళ్లి అందుకే ఆగిపోయిందట!

భారత్ సమాచార్,సినిమా: ప్రభాస్, అనుష్క హిట్ పెయిర్. డార్లింగ్ ఫ్యాన్స్ అనుష్కను వదినమ్మగా పిలుచుకుంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో ప్రభాస్-అనుష్క పెళ్లి ఫొటోలను, వారి పిల్లల ఫొటోలను క్రియేట్ చేసి సంబురపడిపోతారు. వీరు జంటగా బిల్లా, మిర్చి, బహూబలి చిత్రాలతో అలరించారు. వీరి హైట్ , పర్సనాలిటీ మేడ్ ఫర్ ఈచ్ ఆదర్ లా ఉండడం, స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు బయట కూడా ప్రెసెన్స్ అద్దిరిపోవడం, క్లోజ్ నెస్.. ఇవన్నీ చూసిన నెటిజన్లు, ప్రభాస్ ఫ్యాన్స్.. వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయమనుకున్నారు. అలాగే వీరు రిలేషన్ షిప్ లో ఉన్నారని ఇక జంటగా మారే సమయం అసన్నమైందని అనుకునేవారు.

అయితే ఈ జంట పెళ్లి వారి కుటుంబాల వరకు కూడా చేరిందట. ప్రభాస్- స్వీటీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. కానీ జాతకాలు కలువకపోవడంతో పెళ్లిపీటల దాక వెళ్లాలేకపోయారని న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరి ఫ్యామిలీస్ వీరి పెళ్లికి ఒప్పుకున్నా.. జాతకాలు సెట్ కాకపోవడంతో ఈ మ్యారేజ్ జరగదని డార్లింగ్ ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రభాస్ తల్లికి జాతకాలపై బాగా నమ్మకమట. అందుకే ఆమె ఒప్పుకోనట్టు సమాచారం. తల్లిపై ప్రేమ, గౌరవంతో ఈ పెళ్లికి ప్రభాస్ దూరంగా ఉన్నట్టు చెప్తున్నారు. ఏదేమైనా ప్రభాస్- అనుష్క జంట ఇప్పటికే 40ఏండ్లు క్రాస్ చేసింది. మరి చూడాలి వీరి పెళ్లి జరుగుతుందో లేదో..వీరి జీవితాల్లోకి ఎవరూ వస్తారో.

మరికొన్ని సినీ సంగతులు...

‘ఫ్యామిలీ స్టార్ ’ ట్రైలర్ సూపర్ హిట్

RELATED ARTICLES

Most Popular

Recent Comments