Homemain slidesనాలుగు దశాబ్దాల రహస్యం...రత్నభాండాగారం

నాలుగు దశాబ్దాల రహస్యం…రత్నభాండాగారం

భారత్ సమాచార్, ఒడిశా ;

ఒడిశాలోని పూరీ జగన్నాథ్ దేవాలయంలో ఉన్న రత్న భండార్‌ను ప్రత్యేక పూజల అనంతరం నేడు తెరిచారు. దాదాపు 46 ఏళ్ల తర్వాత ఈ గది తలుపుల్ని తెరిచారు. మొత్తం 11 మంది సభ్యులు మాత్రమే ఆలయంలోని రహస్య గదిలోకి ప్రవేశించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న జస్టిస్ బిశ్వనాథ్ రథ్ ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి వివరాలను మేనేజింగ్ కమిటీ వెల్లడిస్తుందని ఒడిశా మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ చెప్పారు. శ్రీ జగన్నాథ్ టెంపుల్ యాక్ట్-1955 ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి రత్న భాండాగారాన్ని తెరచి అక్కడ ఉన్న సంపదను లెక్కించాలి. కానీ గత ప్రభుత్వాలు ఈ గదిని ఎందుకు తెరవలేదో కారణాలు చెప్పలేదు.

ఏమిటీ రత్న భండార్?

12 వ శతాబ్దంనాటి పూరీ జగన్నాథ్ దేవాలయంలోని అత్యంత విలువైన ఆస్తిగా ‘రత్న భండార్’ను అభివర్ణిస్తారు. ప్రధాన జగన్నాథ మందిరానికి ఉత్తర దిశగా బేస్‌మెంట్‌లో ఉండే ఈ భండార్‌లో భక్తులు ఇచ్చే ఆభరణాలు, విరాళాలను ఉంచుతారు. రాజుల నుంచి సామాన్యుల దాకా శతాబ్దాలుగా జగన్నాథస్వామికి సమర్పించు కున్న కానుకల చిట్టా గుట్టు ఈ రోజు వీడబోతోంది. ఒడిశాకు చెందిన సూర్యవంశీ రాజులతోపాటు చాలా మంది రాజులు భారీ మొత్తంలో బంగారాన్ని విరాళంగా అందించినట్లు ‘మదాలా పంజీ’లో ప్రస్తావించారు. ఈ భండార్‌లో రెండు గదులు ఉన్నాయి. వీటిలో ఒకటి బీతర్ భండార్. అంటే లోపలి గది అని కూడా పిలుస్తారు. రెండోది బాహరా భండార్. దీన్ని వెలుపలి గది అని అంటారు.

ఇక ఈ రత్నభండార్‌లో పెద్ద సింహాసనం, జగన్నాథ, బలభద్రులకు భక్తులు సమర్పించిన అరటిపువ్వు ఆకృతి చెవిదిద్దులు ఇలా ఎన్నో విభిన్న ఆభరణాలు న్నాయి. 12వ శతాబ్దంలో పూరీ ప్రాంత రాజుకు లొంగిపోయిన సామంత రాజుల కిరీటాలు, యుద్ధం లో గెల్చుకున్న విలువైన సొత్తునూ రహస్య గదిలో భద్రపరిచారని తెలుస్తోంది. జగన్నాథుడి వజ్ర, వైఢూర్యాలు, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి ఇతర బరువు, నాణ్యత పరిశీలించడానికి ఎక్స్‌పర్ట్స్ అవసరం. ఆడిట్ ప్రాసెస్‌కు కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉంది.

ఈ ఖజానాలో 15 వందల ఏళ్ల క్రితం ఉన్న ఆభరణా లు, నగలు కూడా ఉన్నాయని బిశ్వనాథ్ రథ్ కమిటీ చెబుతోంది. అయితే ఈ ఆభరణాలను గుర్తించేందుకు నిపుణులైన స్వర్ణ కారులు, మెట్రాలజిస్టుల టీమ్‌ను అందుబాటులో ఉంచనున్నారు. జస్టిస్ బిశ్వనాథ్‌ రథ్‌ కమిటీ సభ్యులు కేవలం ఆభర ణాల లెక్కింపును మాత్రమే పర్యవేక్షిస్తారు. రత్న భాండాగారంలోనే నగల లెక్కింపు సాధ్యం కాదంటున్నారు అధికారులు. ఈ సంపదను మరోచోటికి తరలించి పటిష్ఠ భద్రత మధ్య లెక్కించే అవకాశం ఉన్నట్టు ప్రముఖ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. సీసీ కెమెరాలు, ప్రత్యేక పోలీసు బలగాల సమక్షంలో లెక్కింపు, నాణ్యతను పరిశీలించ నున్నారు. గట్టి భద్రత మధ్య లెక్కింపు జరగనుంది. మొత్తంగా నాలుగు దశాబ్దాల రత్న భాండాగారపు రహస్యం మరి కొన్ని గంటల్లో ప్రజలకు తెలియనుంది.

పూరి జిల్లా ఎస్పీ కి అస్వస్థత

అయితే తలుపులను తెరువగానే పూరి జిల్లా ఎస్పీ పినాక్ మిశ్రా గదిలో సొమ్మసిల్లి పడిపోయారు. దాంతో ఆయనను ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ కు తరలించారు. అక్కడ డాక్టర్ సీబీకే మహంతి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎస్పీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

పూరీ జగన్నాథ ఆలయ పూర్తి చరిత్ర, ప్రత్యేకత, విశిష్ఠత

RELATED ARTICLES

Most Popular

Recent Comments