భారత్ సమాచార్, న్యూఢిల్లీ : నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ, దేశంలోని పార్లమెంట్ స్థానాలకు ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ప్రకటించడంతో దేశంలో ఓట్ల పండగకు తెరలేచింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా నేడు విడుదల చేసింది. ఈ క్రమంలో 18 ఏళ్లు నిండిన వారు వెంటనే తమ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎలక్షన్ కమిషన్ సూచించింది. లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనుండగా, ఏప్రిల్ 15 వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం వెల్లడించింది. అలాగే మార్పులు, చేర్పుల కోసం బూత్ లెవల్ ఆఫీసర్ కి ఫామ్-6ను పూర్తి చేసి సమర్పించాలి. ఓటర్ హెల్ప్ అనే యాప్ ద్వారా లేదా https://voters.eci.gov.in/ వెబ్‌సైట్‌లో అన్ని అర్హతలు కలిగిన భారతీయ యువత ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యానికి ఓటు వజ్రాయుధమని, ప్రతీ ఒక్కరూ పక్కాగా ఓటుహక్కు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని భారత ఎన్నికల సంఘం పేర్కొంది.
ఓట్ల పండుగొచ్చింది.. దరఖాస్తు చేసుకోండి
RELATED ARTICLES