Homemain slidesవాళ్లకి ఏ రోజు కూలి ఆరోజే ఇవ్వాల్సిందే!

వాళ్లకి ఏ రోజు కూలి ఆరోజే ఇవ్వాల్సిందే!

భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పండుగలా సాగుతున్నాయి. టీ, టిఫిన్లు, బీరు, బిర్యానీ అన్నట్టుగా వ్యవహరం నడుస్తోంది. పార్టీ కార్యకర్తలైతే ఎలాగూ పార్టీ ప్రచారంలో పాల్గొంటారు. కానీ ప్రచార పర్వానికి జనసమీకరణలో తమ స్టామినా చాటుకునేందుకు అభ్యర్థులకు చుక్కలు కనపడ్తున్నాయి. ఏ పార్టీ ప్రచారానికైనా, మీటింగ్ లకు తోలుకుపోవడానికి రోజూ వారీ కూలి ఇవ్వకతప్పడం లేదు.

గ్రామాలు, పట్టణాల్లో మహిళా సంఘాలకు, రోజువారీ కూలీలకు కూలి ఇస్తే తప్ప ప్రచారానికి రావడం లేదు. పొద్దున ప్రచారం చేస్తే రూ.300, సాయంత్రం ప్రచారం చేస్తే రూ.300, రోజంతా ప్రచారం చేస్తే రూ.500, మధ్యాహ్న భోజనం.. టీ, కూల్ డ్రింక్స్ గట్రా ఇవ్వక తప్పడం లేదు. అయితే కొన్ని పార్టీలు రోజుకూ రూ.80 0దాక ఇస్తున్నారట. ఈ డబ్బులను కూడా ఏ రోజుకు ఆరోజే వసూలు చేస్తున్నారు. రెండు రోజులకో, మూడు రోజులకో ఇస్తామంటే కుదరదని తెగేసి చెప్తున్నారు. అదే రోజు ఇవ్వాలని, కొందరైతే ట్రాక్టరో, బస్సో ఎక్కకముందే పైసలు వసూలు చేస్తున్నారట.

మొత్తానికైతే ఎన్నికలు ఏమోగాని.. జనాలకు మంచి ఎంటర్ టైన్ మెంట్ తో పాటు పైసలు, ఫుడ్, మందు పుష్కలంగా దొరుకుతున్నాయి. వాడుకున్నోళ్లకు వాడుకున్నంతగా మారిపోయింది పరిస్థితి. ఇలా చేయడం తప్పు కాదా..అని కొందరిని ప్రశ్నిస్తే.. గెలిచినంక వాళ్లు కోట్లు సంపాదించుకుంటరు.. మాకేమైనా ఇస్తరా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments