Homebreaking updates newsఈ సారి కూడా బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్లు...

ఈ సారి కూడా బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్లు…

భారత్ సమాచార్, అమరావతి ;

గత మూడు నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ లో సామాజిక పింఛన్ల పంపిణీ పై దేశంలో ఎక్కడ లేని రాద్దాతం జరుగుతోంది అనటంలో సందేహం లేదు. అధికార, విపక్ష పార్టీలు, ఎన్నికల కమిషన్, రాష్ట్ర హై కోర్టు అన్ని వ్యవస్థలు కలిసి అవ్వాతాతలకు ఎక్కడ లేని గందరగోళాన్ని తెచ్చి పెట్టాయి. ఎన్నికల ముందు నెలలో స్థానిక సచివాలయాల్లో పింఛన్ ను పంపిణీ చేశారు. దీనిపై అనేక విమర్శలు, గందరగోళం తలెత్తాక తర్వాత నెలలో మెజార్టీ వ్యక్తులకు బ్యాంకు ఖాతాలోకి నగదును జమ చేశారు. దివ్యాంగులకు, ఆధార్ కార్డుతో బ్యాంకు ఖాతాలకు అనుసంధానం లేని వ్యక్తులకు మాత్రమే ఇంటికి వెళ్లి పింఛన్ ను అందజేశారు. ఇందులో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అయినా కూడా జూన్ లోనూ బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్లు జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల కూడా దివ్యాంగులు, నడవలేని వారికి మాత్రం ఇంటి వద్దే పింఛన్ పంపిణీ చేయనున్నట్టు తెలిపింది.

మరికొన్ని కథనాలు…

జూన్ 1 నుంచి కొత్త రూల్స్… అలర్ట్ అవ్వాల్సిందే

RELATED ARTICLES

Most Popular

Recent Comments