Homemain slides5 రోజుల్లో 85 కోట్లు... అట్లుంటది మనతోని

5 రోజుల్లో 85 కోట్లు… అట్లుంటది మనతోని

భారత్ సమాచార్ ; ఇండస్ట్రీ లో ప్రతి శుక్రవారం కొందరి జాతకాలు మరిపోతుంటాయి అంటారు. అలా ఓ రోజు వెండితెరపై ‘డీజే టిల్లు’ బొమ్మ పడింది. దాంతో దెబ్బకు సిద్దు కాస్త స్టార్ బాయ్ సిద్దు అయిపోయాడు. ఇప్పడు మళ్లీ డబుల్ స్పీడ్ తో ఆ మూవీ కి సీక్వెల్ గా ‘టిల్లు స్వేర్’ అంటూ సినీ ప్రేమికులను తెగ అలరిస్తున్నాడు. ఈ సినిమా విడుదలై కేవలం 5 రోజులు అయింది అంతే. ఈ లోపే ఈ స్టార్ బాయ్ బాక్సాఫీస్ ను భారీ స్థాయిలో దున్నేశాడు. ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే రూ.85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను వసూలు చేసినట్టు సినీ యూనిట్ అధికారికంగా పోస్టర్ ను విడుదల చేసింది.

యూత్ కి బాగా ఎక్కేసిన మేనరిజమ్, డైలాగ్స్…

ఈ మూవీ ఇంతలా సక్సస్ అవ్వటానికి మొదటి కారణం స్టార్ బాయ్ సిద్దూ మెస్మరైజింగ్ ఫర్మామెన్స్. అట్లుంటది మనతోని అంటూ… కుర్రకారును కట్టి పడేశాడు. సినిమా చూసిన యూత్ పై సిద్దూ మేనరిజమ్ ఇంపాక్ట్ బాగా పడింది. మొదటి పార్ట్ లో హాట్ బ్యూటీ నేహా శెట్టి (రాధిక)తో ఆడిన మైండ్ గేమ్ బాగా వర్క్ అవుట్ అయింది. ఈ సారి క్రేజీ హీరోయన్ అనుపమ పరమేశ్వరన్ (లిల్లీ) తో రొమాన్స్, బాక్సాఫీస్ కలెక్షన్ల కి డబుల్ ఎనర్జీ ని ఇచ్చింది. రామ్ ‘టిల్లు స్వేర్’ను తెరకెక్కించాడు. రామ్ మిరియాల సంగీతం అందించాడు. సూర్య దేవర నాగవంశీ నిర్మాత.

మరికొన్ని సినీ సంగతులు…

బాలీవుడ్ లో తారక్ సరసన ఈ ముద్దుగుమ్మే!

RELATED ARTICLES

Most Popular

Recent Comments