భారత్ సమాచార్, నేటి ప్రత్యేకత ;
ప్రముఖుల జననాలు…
1858: జార్జి వాషింగ్టన్ గోఎథల్స్, పనామా కాలువను కట్టిన ఇంజినీరు.
1864: అశుతోష్ ముఖర్జీ, బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, గణితం, సైన్సు, న్యాయశాస్త్రాల్లో నిష్ణాతుడు, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త.
1879: ఆర్కాట్ రంగనాథ మొదలియారు, భారత రాజకీయనాయకుడు, బళ్ళారికి చెందిన దివ్యజ్ఞాన సమాజస్థుడు.
1893: పి.సి.మహలనోబిస్, భారతీయ శాస్త్రవేత్త, అనువర్తిత గణాంకశాస్త్రవేత్త. భారత ప్రణాళిక వ్యవస్థకు పితామహుడు జవహర్ లాల్ నెహ్రూ అయితే, భారత ప్రణాళిక పథానికి పి.సి.మహలనోబిస్ నిర్దేశకుడిగా ప్రసిద్ధిచెందినాడు.ఆయన గణాంక కొలత అయిన “మహలనోబిస్ డిస్టెన్స్” ద్వారా గుర్తింపబడ్డాడు. ఆయన భారతదేశ మొదటి ప్లానింగ్ కమీషన్లో సభ్యుడు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ ను స్థాపించాడు.
1901: అమల్ కుమార్ సర్కార్, భారతదేశ సుప్రీంకోర్టు ఎనమిదవ ప్రధాన న్యాయమూర్తి
1965: రోజా రమణి బోయపాటి, రచయిత్రి, ఉపాధ్యాయిని.
1973: కార్తీక్ రాజా ,సంగీత దర్శకుడు.
ప్రముఖుల మరణాలు…
1998: కమలాకర కామేశ్వరరావు, తెలుగు సినిమా దర్శకుడు. పౌరాణిక బ్రహ్మ పేరు గాంచినాడు
2023: సాయిచంద్, తెలంగాణ కళాకారుడు, గాయకుడు
నేటి ప్రత్యేకత…
జాతీయ గణాంక దినోత్సవం.
జాతీయ కెమెరా దినోత్సవం