Homemain slidesచరిత్రలో ఈరోజు నవంబర్- 11

చరిత్రలో ఈరోజు నవంబర్- 11

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;

నేటి ప్రత్యేకం…

వెటరన్స్ డే.

జాతీయ విద్యా దినోత్సవం.

యుద్ద విరమణ దినం.

ప్రముఖుల జననాలు

1768: సికిందర్ జా, హైదరాబాదు మూడవ నిజాం

1821: దాస్తొయెవ్‌స్కీ, రష్యన్ రచయిత. క్రైమ్‌ అండ్ పనిష్‌మెంట్, బ్రదర్స్ కరమొజొవ్ నవలలు రాశాడు.

1871: కొచ్చెర్లకోట రామచంద్ర వేంకటకృష్ణారావు, తెలుగు రచయిత.

1872: హిందుస్తానీ సంగీతంలోని కిరాణా ఘరానాకు చెందిన వారిలో ముఖ్యుడు అబ్దుల్ కరీంఖాన్ జననం

1888: మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, స్వాతంత్ర్య సమరయోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి.

1899: జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, పంచాంగకర్త.

1905: గుంటి సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు.

1917: కమల్ రణదివె, భారతదేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త.

1918: కృష్ణ కుమార్ బిర్లా, పారిశ్రామికవేత్త, బిర్లా గ్రూపుల అధినేత.

1921: సుసర్ల దక్షిణామూర్తి, దక్షిణభారత చలనచిత్ర సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు.

1924: తెన్నేటి విద్వాన్, రచయిత, సామాజిక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు.

1974: రఘు దీక్షిత్ , భారతీయ గాయకుడు .

1985: భారత వన్డే, ట్వంటీ-20 క్రికెట్ ఆటగాడు రాబిన్ ఊతప్ప జననం.

ప్రముఖుల మరణాలు

1966: భాస్కరభట్ల కృష్ణారావు, ఆకాశవాణిలో దాదాపు 15 ఏళ్ళు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేశాడు. ఈయన 20 సంవత్సరాల కాలంలో మొత్తం 40 కథలు రచించాడు.

1970: మాడపాటి హనుమంతరావు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత .

1974: తిక్కవరపు వెంకట రమణారెడ్డి, హాస్య నటుడు.

1994: కువెంపు, కన్నడ రచయిత, కవి.

2006: కప్పగంతుల మల్లికార్జునరావు, కథా, నవలా, నాటక రచయిత.

2002: గ్రంథాలయోద్యమ నేత, విశాలాంధ్ర ప్రచారకుడు కోదాటి నారాయణరావు మరణం

2020: ఆర్.శాంత సుందరి, తెలుగు రచయిత్రి, అనువాదకురాలు.

2023:చంద్రమోహన్ , తెలుగు చలన చిత్ర నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ .

చరిత్రలోని ప్రముఖ సంఘటనలు

1918: మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది: మిత్రరాజ్యాలు జర్మనీతో యుద్ధవిరమణ ఒడంబడిక చేసుకున్నాయి.

1675 : గురు గోవింద సింగ్ మతగురువయ్యాడు.

మరికొన్ని ప్రత్యేక కథనాలు...

చరిత్రలో ఈరోజు నవంబర్ -10

RELATED ARTICLES

Most Popular

Recent Comments