Homemain slidesసెంచరీ దిశగా టమాట... హాఫ్ సెంచరీ తో ఉల్లి

సెంచరీ దిశగా టమాట… హాఫ్ సెంచరీ తో ఉల్లి

భారత్ సమాచార్, అమరావతి ;

ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాలైన మార్కెట్లలో నాణ్యమైన మొదటి రకం టమాటా ధర రూ. రూ.80-90 వరకు పలుకుతోంది.రెండో రకం టమాటాను రూ.60-70కి అమ్ముతున్నారు. అటు హోల్సేల్ మార్కెట్లలో రూ.120 కి మూడు కిలోల చొప్పున విక్రయిస్తున్నారు. మరోవైపు ఉల్లిపాయల ధర కూడా భారీగానే పెరిగినట్లు తెలుస్తోంది. కేజీ ఉల్లిపాయలు మార్కెట్ లో రూ.50-60 వరకూ పలుకుతోంది. టమాటా, ఉల్లి రేట్లతో సాధారణ ప్రజలు విసిగిపోతున్నారు. కూరగాయల రేట్లతో పాటుగా వీటీ రేట్లు కూడా విపరీతంగా పెరగటంతో ఆందోళనకు గురవుతున్నారు.

పెరుగుతున్న ఉల్లి ధరలు… కొనేముందే కన్నీళ్లు తెప్పిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇందుకు ప్రధాన కారణం ఉల్లి సరఫరా తక్కువగా ఉండటమేనని మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.దేశంలో ఉల్లిని ఉత్పత్తి చేసే అగ్రగామి రాష్ట్రమైన మహారాష్ట్రలో కరువు వంటి పరిస్థితుల కారణంగా ఉత్పత్తిలో లోటు ఉందని చెబుతున్నారు. దీంతో దేశంలో గత రెండు వారాలలో ఉల్లి ధరలు 30 నుంచి 50 శాతం పెరిగాయి. ఈ క్రమంలోనే కొందరు వ్యాపారులు ఉల్లిని నిల్వ చేసి.. ధరలు మరింతగా పెరిగేలా చేస్తున్నారని, అలా ధరలు పెరిగిన తర్వాత అమ్ముకోవాలని చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనే డిమాండ్ బాగా వినిపిస్తోంది.

మరోవైపు సెప్టెంబరు, అక్టోబరు వరకు కొత్త ఖరీఫ్ పంట చేతికి వచ్చే అవకాశం లేకపోవడంతో ఉల్లి కిలో రూ.50 నుంచి రూ.60 దాటవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక, దేశంలోని ఉల్లిలో 42 శాతానికి పైగా ఉత్పత్తి చేసే మహారాష్ట్ర.. తీవ్రమైన కరువు పరిస్థితుల కారణంగా ఉత్పత్తిలో 15 నుంచి 20 శాతం తగ్గుదలని చవిచూసింది. మహారాష్ట్రలోని 27 జిల్లాలలో 20 నుంచి 45 శాతం వరకు లోటు వర్షపాతాన్ని ఎదుర్కొన్నాయని గణంకాలు సూచిస్తున్నాయి.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

రేషన్‌ కార్డుదారులకు గుడ్‌ న్యూస్‌… బిగ్ అలర్ట్

RELATED ARTICLES

Most Popular

Recent Comments