Homemain slidesత్రిషకు క్షమాపణ చెప్పేదే లేదు: మన్సూర్

త్రిషకు క్షమాపణ చెప్పేదే లేదు: మన్సూర్

భారత్ సమాచార్, సినీ టాక్స్ : ప్రముఖ తార త్రిష గురించి తాను ఒక్క మాట తప్పుగా మాట్లాడలేదని, అలాంటప్పుడు తానేందుకు క్షమాపణ చెప్పాలని తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ తెగేసి చెప్పారు. త్రిషపై మన్సూర్ చేసిన వ్యాఖ్యలపై నాలుగైదు రోజులుగా దేశ వ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో నడిగర్ సంఘంతో పాటు పలువురు నటీమణులు మన్సూర్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

దీనిపై మన్సూర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ఈవిషయంలో తనవద్ద ఎలాంటి వివరణ కోరకుండా బహిరంగ క్షమాపణ చెప్పాలని నడిగర్ సంఘం పత్రికా ప్రకటన ద్వారా కోరడంపై ఆయన మండిపడ్డారు. తాను ఎప్పుడో మాట్లాడిన విషయాన్ని త్రిష దృష్టికి తీసుకెళ్లి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, ఈవిషయంలో తనను జాతీయ స్థాయిలో పెద్ద హీరోను చేశారన్నారు.

త్రిష గురించి తాను ఒక్కమాట కూడా తప్పుగా మాట్లాడలేదని, ఆమెను అభినందిస్తూ మాత్రమే మాట్లాడనన్నారు. సినిమాల్లో రేప్ సీన్లలో నటిస్తున్నారంటే నిజంగానే రేప్ చేస్తున్నారా? హత్య చేసే సీన్లలో నిజంగానే హత్యలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రజలు తనవైపే ఉన్నారని.. తాను ఎవరినీ క్షమాపణలు కోరానని చెప్పారు. నన్ను రెచ్చగొడితే అగ్నిగోళంలా బద్దలవుతా.. అదే జరిగితే చుట్టుపక్కల ఉన్నవారంతా పారిపోతారని హెచ్చరించారు.

క్షమాపణలు చెప్పాలని అల్టిమేటం జారీ చేసిన నడిగర్ సంఘంపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. ఈవిషయంలో నడిగర్ సంఘం తప్పు చేసిందని, ఏంజరిగిందో కనీసం తెలుసుకోలేదని, తన వివరణ కోరలేదని.. అందుకు తానే నడిగర్ సంఘానికి డెడ్ లైన్ విధిస్తున్నానని ధ్వజమెత్తారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments