భారత్ సమాచార్.నెట్: అగ్రరాజ్యం అమెరికా భారత్‌కు షాక్ ఇచ్చింది. భారత్‌పై మరో 25 శాతం సుంకాన్ని విధించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే భారత్‌పై 25 శాతం టారిఫ్‌లను అమలు చేసిన ట్రంప్.. తాజాగా మరో 25 శాతం అంటే మొత్తం 50 శాతం టారిఫ్‌లను విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై ట్రంప్ సంతకం చేశారు. ఈ అదనపు టారిఫ్ ఆగస్ట్ 27 నుంచి అమలులోకి రానుంది.
రష్యా నుంచి భారత్ పెద్దమొత్తంలో చమురు కొనుగోలు చేస్తోందని.. దాని వల్ల ఉక్రెయిన్ యుద్ధానికి మరింత ఆజ్యం పోస్తోందని ట్రంప్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే భారత్‌పై అదనపు టారిఫ్‌లు పెంచారు ట్రంప్. భారత్‌తో తమకు స్నేహపూర్వక బంధం ఉందని.. కానీ వాణిజ్య విషయంలో ఇరు దేశాల మధ్య మంచి బంధం లేదని ఇటీవల ట్రంప్ పేర్కొన్నారు. భారత్‌తో అమెరికా తక్కువ స్థాయిలో వ్యాపారం చేస్తున్న అధిక మొత్తంలో టారిఫ్‌లు విధిస్తుందన్నారు.
ఇక ట్రంప్ 50 శాతం టారిఫ్‌లపై భారత్ ఎలా స్పందిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ట్రంప్ టారిఫ్‌లకు భారత్ ప్రతీకార చర్యలు చేపడుతుందా అనే చర్చ మొదలైంది. కాగా, భారత్ తమ మిత్రదేశం అంటూనే అమెరికా ఇలా అధిక టారిఫ్‌లు విధించడంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు. ట్రంప్ చర్యలపై మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నిస్తున్నాయి.