Homebreaking updates newsభారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించిన ట్రంప్

భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించిన ట్రంప్

భారత్ సమాచార్.నెట్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నట్లుగానే పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సుంకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా ఆయన స్పష్టం చేశారు. వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ఈ రోజును ‘లిబరేషన్ డే’గా ట్రంప్ అభివర్ణించారు.
భారత్‌పై 26 శాతం, చైనాపై 34 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు. సుంకాల ప్రకటనతో అమెరికాలో మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని.. కంపెనీలు తిరిగి వెనక్కి వస్తాయని.. విదేశీ మార్కెట్లకు ద్వారాలు తెరుస్తామని చెప్పారు. అమెరికాలో పోటీతత్వం పెరిగి సరసమైన ధరల్లో వస్తువులు లభిస్తాయని, దీంతో అమెరికాలో మళ్లీ స్వర్ణయుగం మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక తమపై ఇతర దేశాలు విధిస్తున్న సుంకాల్లో సగమే తాము విధిస్తున్నామని.. వీటిని రాయితీ టారిఫ్‌లుగా ట్రంప్ పేర్కొన్నారు. గత కొన్ని దశాబద్దాలుగా అనేక దేశాలు అమెరికాను మోసం చేశాయన్నారు. కానీ ఇకపై అలా జరగదని.. తమపై భారీగా సుంకాలు విధించే దేశాలపై తప్పకుండా సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు.

 

ఇకపోతే భారత్‌పై తాము 27 శాతం విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్.. ప్రధాని మోదీ గురించి కూడా ప్రస్తావించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడని చెప్పారు. కానీ అమెరికా భారత్‌తో సరైన విధంగా వ్యవహరించడం లేదన్నారు. తమ 52 శాతం సుంకాలను విధిస్తోందన్నారు. ఇదిలా ఉంటే ప్రతీకార సుంకాల ప్రకటన తర్వాత అనేక దేశాల నాయకులు, రాయబారులు, రాజులు ట్రంప్‌ను సంప్రదించి మినహాయింపులు కోరినట్లు తెలుస్తోంది. అయితే తమ ఉత్పత్తులపై సుంకాలను తగ్గిస్తేనే తాము తగ్గిస్తామని.. తాము న్యాయమైన వాణిజ్య నిబంధనలు కోరుకుంటున్నామని ట్రంప్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments