Homebreaking updates newsTTD: టీటీడీ గోవులను కమీషన్ల కోసం అమ్మేశారు: బీఆర్ నాయుడు

TTD: టీటీడీ గోవులను కమీషన్ల కోసం అమ్మేశారు: బీఆర్ నాయుడు

భారత్ సమాచార్.నెట్, తిరుమల: తిరుమల (Tirumala) గోశాల (Gosala) వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. టీటీడీ ఎస్వీ గోశాలలో 100కు పైగా గోవులు మృతి చెందాయని ఇటీవల వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలతో.. ఇప్పుడు వైసీపీ (YCP) ఇబ్బందులు పడే ప్రమాదం ఏర్పడింది. వైసీపీ హయాంలో గోశాల కేంద్రంగా సాగిన దారుణాలు, అక్రమాలను టీటీడీ ఛైర్మన్ (TTD Chairman) బీఆర్ నాయుడు (BR Naidu) బయటకు తీస్తున్నారు.
తాజాగా తిరుపతిలోని టీటీడీ గో సంరక్షణ శాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సందర్శించారు.  ఆయనతో పాటు టీటీడీ మాజీ గో సంరక్షణ సభ్యులు, గోరక్షక దళ్ వ్యవస్థాపకులు కోటి శ్రీధర్.. గోరక్షక దళ్ తెలంగాణ అధ్యక్షులు కాలు సింగ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడారు. గత ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ హయాంలో గోవుల గడ్డిని కూడా తినేశారని బీఆర్ నాయుడు ఆరోపించారు. ఈ క్రమంలో గోశాలలోని గోవులను ఒంగోలుకు తరలించి కమీషన్లకు అమ్మేశారని విమర్శలు గుప్పించారు. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డి అక్రమాలు అన్నీ ఇన్నీ కావన్నారు.
హరినాథరెడ్డి బాగోతం బయటపడుతుందని.. గోశాలలోని రికార్డులన్ని ఎత్తుకుపోయాడని ఆరోపించారు. హరినాథరెడ్డిపై కచ్చితంగా చర్యలు చేపడుతామని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. గోశాల వ్యవహారంపై నలుగురు సభ్యులతో కూడిన కమిటీ వేస్తామన్నారు. గోశాలలో అసలేం జరుగుతుందో కమిటీ తేలుస్తుందన్నారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పులను తమపై రద్దు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన వారెవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు.
RELATED ARTICLES

Most Popular