భారత్ సమాచార్.నెట్, యాదాద్రిభువనగిరి: దేశంలో నిత్యం రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుండడంతో భయాందోళనకు గురిచేస్తుంది. అతివేగం, ఓవర్‌టెక్, రాంగ్ రూట్‌లలో వెళ్లడం, అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ప్రమాదాలు ఆగడం లేదు.
లారీని తప్పించబోయి డివైడర్ ఎక్కి రాంగ్ రూట్‌లో:
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్దనున్న జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి చెందారు. విజయవాడ వైపు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టడంతో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఏపీకి చెందిన డీఎస్పీలు చక్రధర్ రావు, శాంతారావు ప్రాణాలు కోల్పోయారు. అడిషనల్ ఎస్పీ ప్రసాద్, డ్రైవర్‌కు నర్సింగ్‌రావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక డ్రైవర్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. స్కార్పియో వాహనం ముందున్న లారీని తప్పించబోయి డివైడర్ ఎక్కి రాంగ్ రూట్‌లోకి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని కథనాలు: