భారత్ సమాచార్, సినీ టాక్స్ ;
చిత్రం ; హుషారు
సంగీత దర్శకుడు ; రథన్
గీతా రచయిత ; కిట్టు
గానం సిద్ధ్ శ్రీరామ్
ఉండిపోరాదే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే
అయ్యో అయ్యో పాదం
నేలపై ఆగనన్నది
మళ్ళీ మళ్ళీ గాల్లో
మేఘమై తేలుతున్నది
అందం అమ్మాయైతే
నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే
అడగాలంటే కౌగిలే
ఉండిపోరాడే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే
నిశిలో శశిలా నిన్నే చూసాక
మనసే మురిసే ఎగసే అలలాగ
ఏదో మైకంలో నేనే ఉన్నాలే
నాలో నేనంటు లేనులే
మండే ఎండల్లో వెండి వెన్నెలనే
ముందే నేనెప్పుడూ చూడలే
చీకట్లో కూడా నీడలా
నీవంటే నేను ఉండగా
వేరే జన్మంటు నాకే ఎందుకులే
నీతో ఈ నిమిషం చాలు
అందం అమ్మాయైతే
నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే
అడగాలంటే కౌగిలే
ఉండిపోరాడే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే
చెప్పుకోలేనే బాధ నీతోనే
దాచుకోలేనే గుండెల్లో నేనే
చెప్పుకోలేనే బాధ నీతోనే
దాచుకోలేనే గుండెల్లో నేనే
నిన్నే నమ్మి చేశానే నేరం
కళ్ళే తెరిచి వెళుతున్నా దూరం
ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా
ముందే నువు చేసిన మోసమే
గుప్పెట్లో దాచే నిప్పల్లే ఉందే
నీతో గడిపిన ఆ కాలమే
కన్నిరంటూ రాకున్నదే
బాధే తీరే దారుండదే
మగువకి మరుపంటే ఎంతో తేలికని
నిన్నే చూశాక తెలిసెను నేడే
కాలం చేసే గాయం మానే దారే లేనేలేదా
నా గుండెల్లో ముల్లే గుచ్చి
చంపేశావే నన్నిలా
చెప్పుకోలేనే బాధ నీతోనే
దాచుకోలేనే గుండెల్లో నేనే