Homebreaking updates newsUNESCO: భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

UNESCO: భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

భారత్ సమాచార్.నెట్: హిందువుల పవిత్ర గ్రంధం భగవద్గీత (Bhagavad Gita)కు అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో (UNESCO) మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌ (Memory of World Register)లో భగవద్గీతకు చోటు దక్కింది. భగవద్గీత, భరతముని రాసిన నాట్య శాస్త్రాని (Natyashastra)కి గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్(Gajendra Singh Shekhawat) ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇది అపురూపమైన ఘట్టం అని.. భారత నాగరికత వారసత్వానికి చారిత్రాత్మక క్షణం అని అభివర్ణించారు. అలాగే ఇప్పటి వరకు మన దేశం నుంచి 14 శాసనాలు యునెస్కో రిజిస్టర్‌లో చోటు దక్కించుకున్నాయని రాసుకొచ్చారు.

కౌరవులు, పాడంవుల మధ్య యుద్ధం జరగ్గా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే తన సోదురులతో పాటు గురువులు, బంధువులు, ప్రజలు కూడా చనిపోవడం చూసి అర్జునుడు తీవ్ర మనస్తాపానికి గురవుతాడు. కూర్చున్న చోటే కుప్పకూలిపోయి.. యుద్ధం చేసేందుకు శక్తి లేక కన్నీళ్లు పెడుతుంటాడు. అప్పుడే శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చి అర్జునుడికి జ్ఞాన బోధ చేశాడు. ఆయన చేసిన జ్ఞానబోధనే భగవద్గీతగా మలిచారు. మొత్తంగా ఇందులో 18 అధ్యాయాలు ఉంటాయి. అందులో మనుషులు ఎలా ప్రవర్తించాలి, జీవితాలను ఎలా గడపాలో వివరించారు.
మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్‌లో చోటు దక్కించుకోవడంపై ప్రధాని మోదీ (PM Modi) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి గర్వకారణమైన క్షణం ఇది. యునెస్కో మెమరీ ఆఫ్ దీ వరల్డ్ రిజిస్టర్‌లో భగవద్గీత, నాట్యశాస్త్రానికి చోటు దక్కడం.. భారత సాంస్కృతిక వారసత్వానికి, శాస్రీయా జ్ఞానానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. భగవత్గీత, నాట్యశాస్త్రం శతాబద్దాలుగా నాగరికతను, చైతన్యాన్ని పెంపొదించాయని.. అవి ప్రపంచానికి స్ఫూర్తినిస్తున్నానే ఉన్నాయని మోదీ ట్వీటర్ వేదికగా రాసుకొచ్చారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments