Homemain slidesవిత్తనం మహా వృక్షం అయ్యేంత వరకు...

విత్తనం మహా వృక్షం అయ్యేంత వరకు…

భారత్ సమాచార్, ఫిలాసఫీ ;

విత్తనం తినాలని
                 చీమలు చూస్తాయ్..
                మొలకలు తినాలని
                 పక్షులు చూస్తాయ్..
          
                 మొక్కని తినాలని
                పశువులు చూస్తాయ్

                 అన్నీ తప్పించుకుని
             ఆ విత్తనం వృక్షమైనపుడు..

            చీమలు, పక్షులు, పశువులు..
         ఆ చెట్టుకిందకే నీడ కోసం వస్తాయ్….

            జీవితం కూడా అంతే TIME
          వచ్చే వరకు వేచివుండాల్సిందే
          దానికి కావాల్సింది ఓపిక మాత్రమే…..       

              జీవితంలో కష్టము,
             కన్నీళ్ళు, సంతోషము,
        బాధలు ఏవి శాశ్వతంగా ఉండవు,

     కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు.
       ఆనందం, ఆవేదన కూడా అంతే.

              నవ్వులూ, కన్నీళ్ళూ
              కలగలసినదే జీవితం

             కష్టమూ శాశ్వతం కాదు,
       సంతోషమూ శాశ్వతం కాదు.

                  ఓడిపోతే
            గెలవడం నేర్చుకోవాలి,

                     మోసపోతే
       జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి

                  చెడిపోతే ఎలా
           బాగుపడలో నేర్చుకోవాలి,

         గెలుపును ఎలా పట్టుకోవాలో
                తెలిసిన వాడికంటే
                   ఓటమిని ఎలా
          తట్టుకోవాలో తెలిసిన వారే
               గొప్ప వారు నేస్తమా !

              దెబ్బలు తిన్న రాయి
            విగ్రహంగా మారుతుంది

              కానీ దెబ్బలు కొట్టిన
             సుత్తి మాత్రం ఎప్పటికీ
          సుత్తిగానే మిగిలిపోతుంది….

          ఎదురు దెబ్బలు తిన్నవాడు,
         నొప్పి విలువ తెలిసిన వాడు
          మహనీయుడు అవుతాడు…

       ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు
    ఎప్పటికీ ఉన్నదగ్గరే ఉండిపోతాడు…
   
         (వాట్సాఫ్ యూనివర్శిటి నుంచి సేకరణ)

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

గడియారం కొనచ్చు కానీ… కాలాన్ని కాదు

RELATED ARTICLES

Most Popular

Recent Comments