Homemain slidesమీ ఓటరు కార్డును అప్‌డేట్ చేసుకోండిలా...

మీ ఓటరు కార్డును అప్‌డేట్ చేసుకోండిలా…

భారత్ సమాచార్, జాతీయం ; 2024 లోక్ సభ ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయి రంగం సిద్ధమైంది. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుద్దం. ఓటు హక్కును వినియోగించకోవటం ప్రజల బాధ్యత కూడా. మరి మీ ఓటర్ ఐడీ కార్డులో చిరునామా తప్పుగా ఉంటే ఓటు వేయడం చాలా కష్టం. అందుకే ఇప్పుడు ఓటరు గుర్తింపు కార్డు చిరునామాను వెంటనే అప్‌డేట్ చేసుకోండి. ఎక్కడికి వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునే వీలు ఉంది.

1. ఓటరు గుర్తింపు కార్డుపై చిరునామాను అప్‌డేట్ చేయడానికి, మీరు ముందుగా నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ https://voters.eci.gov.in/ లోకి లాగిన్ అవ్వాలి. వెబ్‌సైట్ హోమ్‌పేజీలో ఎలక్టోరల్ రోల్‌లో నమోదుల సవరణ అని కనిపిస్తుంది. ఆ విభాగంపై క్లిక్ చేయాలి.

2. ఆ తర్వాత ఫారం-8పై క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు కొన్ని అవసరమైన వివరాలను నమోదు చేయాలి. ఇక్కడ మీరు సెల్ఫ్ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

3. ఇక్కడ మీరు షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ ఎంపికను ఎంచుకోవాలి. మీ అడ్రస్ నియోజకవర్గం లోపల లేదా వెలుపల మారుతుందో లేదో కూడా మీరు ఎంచుకోవాలి. ఆ తర్వాత ఓకే మీద క్లిక్ చేయాలి.

4. అప్పుడు మీరు మీ రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, పార్లమెంటరీ నియోజకవర్గం సమాచారాన్ని అందించాలి. మీ ఆధార్ నంబర్, ఈ-మెయిల్, మొబైల్ నంబర్‌ను నమోదు చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

5. తర్వాత మీ కొత్త అడ్రస్‌ ను ఎంటర్‌ చేసి ఓటరు ఐడీ కార్డ్‌లో అప్‌డేట్ చేయాలి. చిరునామా పత్రాన్ని అప్‌లోడ్ చేసిన తర్వాత తదుపరి ఎంపికపై క్లిక్ చేయాలి. చివరిగా క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయాలి.

6. ఆ తర్వాత మీ ఆన్‌లైన్ అప్లికేషన్ వెరిఫై చేయటానికి స్వీకరించబడుతుంది. అయితే మీరు అప్లై చేసే ముందు అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయా? లేదా అని సరి చూసుకోవాలి. మీ ఓటర్ ఐడీలో కొత్త అడ్రస్‌ అప్‌డేట్ చేయడం జరుగుతుంది. దీని కోసం మీరు ఎటువంటి డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం
కూడా లేదు.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

మనకు ఓటు హక్కు ఎలా వచ్చిందో తెలుసా?

RELATED ARTICLES

Most Popular

Recent Comments