Homemain slidesవినియోగదారులు వాట్సాఫ్ లో ఫిర్యాదు చేయచ్చు

వినియోగదారులు వాట్సాఫ్ లో ఫిర్యాదు చేయచ్చు

భారత్ సమాచార్, జాతీయం ;

మీకు ఇక మీదట ఎక్కడైనా, ఎవరైన వ్యాపారులు ఎమ్మార్పీ (MRP-MAXIMUM RETAIL PRICE) కంటే ఎక్కువ ధరకు వస్తువులు అమ్ముతున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తోంది భారత ప్రభుత్వం. కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇందు కోసం ‘వాట్సాప్‌ చాట్‌బాట్‌’ సేవలను తాజాగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇందులో మీరు ఫిర్యాదు చేయాలనుకుంటే వాట్సాప్‌ నంబర్‌ 88000 01915 లో మొదట హాయ్‌ అని టైప్‌ చేయాలి. అక్కడి సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేస్తే జాతీయ వినియోగదారుల కమిషన్‌ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు నమోదవుతుంది. అనంతరం కేసు పరిష్కారం కోసం ఈ వివరాలు ఆయా జిల్లా వినియోగదారుల కమిషన్‌కు పంపుతారు. కేసు పరిష్కారం అయ్యే వరకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. దీంతో పాటు 1800114000 లేదా 1915 నంబర్‌కు కాల్‌ చేసి సైతం (ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు) వినియోగదారులు ఫిర్యాదు చేయొచ్చు. వినియోగదారులు కచ్చితంగా అమ్మకపుదారుల వద్ద మీరు తీసుకున్న వస్తువులకి బిల్లు తీసుకోవాల్సి ఉంటుంది.

ప్రతి రోజూ వేల ఫిర్యాదులు నమోదవుతుండగా, అందులో పరిష్కారమైన కేసులకు సంబంధించిన వివరాలను కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ https:/consumerhelpline.gov.in/
వెబ్‌సైట్‌లో ‘ఎన్‌సీహెచ్‌ సక్సెస్‌ స్టోరీస్‌’ పేరుతో అందరికి అందుబాటులో పొందుపరుస్తోంది.

మరికొన్ని ప్రత్యేక వార్తా విశేషాలు…

కొత్త ట్రాఫిక్ రూల్స్ గురించి తెలుసుకో గురూ

RELATED ARTICLES

Most Popular

Recent Comments