భారత్ సమాచార్, అక్షర ప్రపంచం :
’’ ప్రేమికుల దినోత్సవం ‘‘ రోజున ప్రేమను వెతికిన ప్రేమికులను ప్రేమగా పలకరించింది ప్రేమ…
మీరు…?
‘ప్రేమ’
నిర్వచనం …
ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే
రూపం…
మాటల్లో చెప్పలేనిది… అక్షరాల్లో రాయలేనిది
ఎక్కడ వెతకచ్చు
రెండు మనసుల భావాల కలయికలో
ఏ భాషలో
ప్రేమికులు ప్రేమించుకునే భాషలో
ఏ ప్రాంతంలో ?
అంతం లేని ప్రపంచమంతా
కులం, మతం ?
అవసరం లేదు, రాదు
వయస్సు?
ప్రేమాంమృతంతో నిత్య యవ్వనం
కావాలంటే !
ప్రేమించాలి
ధర ఉంటుందా?
వెలకట్టలేం కదా…ఆ అవకాశమే లేదు
ప్రేమను పంచే ప్రేమికులందరికీ ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు మరి
ఇట్లు…
మీరు ప్రేమించే
మిమ్మల్ని ప్రేమించే
మీ ప్రేమ
ఇక్కడ మరి కొన్ని ప్రేమ మాటలు…
’’ప్రేమకి, ఇష్టానికి తేడా ఏంటోయ్?
గులాబీ పూవ్వు ఉందనుకోండీ,
ఇష్టపడితే కోస్తాం,
అదే ప్రేమిస్తే
నీళ్లు పోస్తాం‘‘
’’ప్రేమను ప్రేమించిన ప్రేమ
ప్రేమకై ప్రేమించిన ప్రేమను
ప్రేమిస్తుంది ‘‘
’’కన్నీళ్లు మనకు వస్తే కష్టం… అదే మన కోసం వస్తే ప్రేమ‘‘
’’జ్ఞాపకాలు…
మంచివి అయినా,
చెడ్డవైనా,
మనతోనే ఉంటాయి… మోయక తప్పదు‘‘