Varun Tej: పుట్టబోయే బేబీ కోసం వరుణ్ షాపింగ్!

భారత్ సమాచార్.నెట్: టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. పుట్టబోయే బిడ్డ కోసం వరుణ్ షాపింగ్ చేస్తున్న ఫోటోని లావణ్య పంచుకుంది. “మై రియల్ బంగారం”… బేబీ కోసం ఏ బ్లాంకెట్ కొనాలా అని ఆలోచిస్తున్నాడు అంటూ రాసుకొచ్చింది లావణ్య.

 

తమకు పుట్టబోయే బిడ్డ కోసం అన్ని బెస్ట్‌గా ఉండాలని వరుణ్ తేజ్ ఇప్పటి నుంచే పలు వస్తువులు కొంటున్నాడు. అయితే బెడ్ షీట్ విషయంలో ఏది తీసుకోవాలో అర్థంకాక కన్ఫూజన్‌లో పడిపోయాడు. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు విభన్న రకాలుగా స్పందిస్తున్నారు. తండ్రిగా వరుణ్ అప్పుడే బాధ్యతలు స్వీకరించాడని ఒకరు.. ఎంత బిజీగా ఉన్నప్పటికీ తానే స్వయంగా ఇలా షాపింగ్ చేయడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

ఇకపోతే విరామం దొరికిన ప్రతిసారి భార్యతో టైం స్పెండ్ చేస్తున్నాడు వరుణ్ తేజ్. లావణ్య ప్రెగ్నెన్సీతో విషయం బయటపెట్టినప్పటి నుంచి షూటింగ్స్ మధ్యలో సమయం దొరికినప్పుడల్లా ఎప్పటికప్పుడు లావణ్యతో టూర్స్‌కు వెళ్తున్నాడు. పెళ్లికి ముందు చాల కాలం పాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దలను ఒప్పించి 2023లో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. వారి ప్రేమ బంధానికి ప్రతీకగా పండంటి బిడ్డను ఆహ్వానిస్తున్నారు ఈ బ్యూటీఫుల్ కపుల్.

Share This Post