Homemain slidesకవితకు బెయిల్ రావడంపై వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

కవితకు బెయిల్ రావడంపై వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత్ సమాచార్, హైదరాబాద్: ఇన్నాళ్లు ఆమెకు బెయిల్ నిరాకరించిన న్యాయస్థానం.. ఎట్టేకేలకు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు ఎందుకు ఇచ్చిందనే విషయంపై ప్రస్తుతం అందరికీ అనుమానం కలుగుతోందని వీహెచ్ హనుమంతరావు అన్నారు.  ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కవిత బెయిల్‌పై సీబీఐ, ఈడీ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ అంతర్గత ఒప్పందం కుదుర్చుకోవడం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని జోరుగా ప్రచారం జరుగుతోందని చెప్పారు. అందుకే దర్యాప్తు సంస్థలు కూడా సుప్రీంలో కౌంటర్ పిటిషన్స్ వేయలేదని, దర్యాప్తు పూర్తయినట్లు ఒప్పుకున్నాయని చెప్పినట్లు గుర్తుచేశారు.అయితే, చట్టం అందరికీ సమానమేనని, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తుది తీర్పు వచ్చాకే తాను మళ్లీ మాట్లాడుతానని వీహెచ్ వెల్లడించారు. ఇదిలాఉండగా, కవితకు బెయిల్ రావడంపై అటు అధికార కాంగ్రెస్.. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయని అంటుంటే.. బీజేపీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.

అయితే త్వరలో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బెయిల్ రావడానికి కారణం విలీనమే కారణమని ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఎంత వరకు నిజమో కొన్ని రోజులు వేచి చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments