Vijay Deverakonda: నటుడు విజయ్ దేవరకొండకు నిరసన సెగ

భారత్ సమాచార్.నెట్, తిరుపతి: ప్రముఖ టాలీవుడ్ హీరో విజయ్‌ దేవరకొండకు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల గిరిజనులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగాయి. విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం కింగ్‌డమ్‌కు చిక్కులు తెచ్చి పెట్టింది ఈ పరిణామం. ఏపీలోని తిరుపతి నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్‌లో కింగ్‌డమ్ మూవీ ట్రైలర్ లాంచ్‌ ఈవెంటన్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఈవెంట్‌కు సంబంధించి భారీ ఏర్పాట్లు చేయడంతో.. విజయ్‌కు వ్యతిరేకంగా కొందరు ఆందోళన చేపట్టారు.

 

విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న చిత్రం కింగ్‌డమ్. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన ఈ మూవీ ఈ నెల 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం తిరుపతిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే విజయ్‌కు వ్యతిరేకంగా గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను అడ్డుకుంటామని గిరిజన సంఘాలు హెచ్చరించాయి. దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

ఇకపోతే రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కశ్మీర్ ఉగ్రదాడిని ఖండిస్తూ.. గిరిజనులను ఉగ్రవాదులతో పోలుస్తూ విజయ్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గిరిజన సంఘాలు ఖండించడమే కాకుండా హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో విజయ్ దేవరకొండపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టింది. ఈ వ్యవహారం తీవ్ర వివాదానికి దారి తీయడంతో తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ.. బాధపడిన వారికి క్షమాపణలు కూడా చెప్పారు. అయిన ఇంకా ఈ వ్యాఖ్యలపై గిరజన సంఘాలు ఖండిస్తున్నాయి.

 

Share This Post