Homemain slidesవిరాట్ అందుబాటులో లేడు... భారత జట్టు ప్రకటన

విరాట్ అందుబాటులో లేడు… భారత జట్టు ప్రకటన

భారత్ సమాచార్, క్రీడలు : స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో భాగంగా మిగిలిన 3 టెస్టు మ్యాచ్ లకు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. అందరూ ఊహించినట్లే వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లి అందుబాటులో లేడని సెలక్షన్ కమిటీ మీడియాకు, క్రీడీభిమానులకు తెలిపింది. విరాట్ తీసుకున్న నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. గాయాల కారణంగా రెండో టెస్టుకు దూరం అయిన కర్ణాటక స్పెషల్ బ్యాటర్/ వికెట్ కీపర్ కెఎల్ రాహుల్, ఆల్ రౌండర్ సర్ రవీంద్ర జడేజా తిరిగి భారత జట్టులోకి వచ్చేశారు. అయితే ఈ ఇద్దరి ఆటగాళ్లకు బీసీసీఐ మెడికల్ టీం నుంచి ఫిట్ నెస్ క్లియరెన్స్ ఉంటేనే వీరికి తుది జట్టులో ఆడే అవకాశాలు ఉంటాయి. లేకపోతే వీరిని గ్రౌండ్ లో చూసే అవకాశాలు లేనట్టే. కొత్తగా ఆకాష్ దీప్ భారత టెస్టు క్రికెట్ టీంలోకి ప్రవేశించాడు. బౌలింగ్ విభాగంలో  బుమ్రా, సిరాజ్ ఇద్దరూ కూడా మిగిలిన మూడు టెస్టు మ్యాచులకు అందుబాటులో ఉన్నారు.

మూడో టెస్టు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి రాజ్ కోట్ లో, నాలుగవ టెస్టు ఫిబ్రవరి 23వ తేదీన రాంచీ లో, ఐదవ టెస్టు మార్చి 7వ తేదీ ధర్మశాలలో నిర్వహించనున్నారు. ఇప్పటికే భారత్ , ఇంగ్లాండ్ జట్లు చెరో విజయం సాధించి సిరీస్ ను సమం చేసిన విషయం తెలిసిందే. మిగిలిన మ్యాచ్ లను గెలిచి సిరీస్ ను గెలుచుకోవాలని ఇరు జట్లు కూాడా పట్టుదలగా ఉన్నాయి.

రోహిత్ సారథ్యంలోని టీం ఇండియా ఇదే

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వీ జైశ్వాల్, శుభమన్ గిల్, కెఎల్ రాహుల్, రజత్ పటిదార్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్,ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.

మరికొన్ని క్రీడా విశేషాలు…

ఒకే ఒక్కడు… నిలిచాడు నిలబెట్టాడు

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments