భారత్ సమాచార్ ; టాలీవుడ్ ప్రముఖ హీరో దినేష్ నాయుడు జన్మదినం నేడు. తెలుగులో దినేష్ అనే కథానాయకుడు ఎవరు అని ఆలోచిస్తున్నారా? మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అంటే ఇక సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. విశ్వక్ అసలు పేరు దినేష్ నాయుడు. న్యుమరాలజీ ప్రకారం చిత్ర పరిశ్రమలో విశ్వక్ సేన్ అని పేరు మార్చకున్నాడు ఈ యంగ్ హీరో. మార్చి 29 1995 లో హైదరాబాద్ లో జన్మించాడు ఈ యాక్టర్. తెలుగులో సరిగ్గా పది సినిమాలు కూడా చేయకుండానే యూత్ లో స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. యాక్టింగ్ తో పాటుగా, రైటింగ్, డైరెక్షన్ కూడా చేశాడు.
నేడు ఈ సినీ ‘గామీ’ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో టాలీవుడ్ తారలతో పాటుగా అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ స్పెషల్ డే రోజున తన కొత్త సినిమా అప్డేట్ కూడా ఇచ్చాడు విశ్వక్. తన తాజా చిత్రంలో ‘మెకానిక్ రాకీ’గా అలరించబోతున్నాడు. బర్త్ డే విషెస్ తెలుపుతూ, టైటిల్ రివీల్ చేస్తూ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు దర్శకనిర్మాతలు. ఈ ఫస్ట్ లుక్ ఇప్పడు నెట్టింట వైరల్ గా మారింది. నోట్లో సిగరెట్, చేతిలో స్పానర్ పట్టుకొని మాసీ లుక్ ను రివీల్ చేశారు. రవితేజ ముళ్లపూడి దర్శకుడు. రామ్ తళ్లూరి నిర్మాత. గత నెలలో విడుదలైన ‘గామీ’ విమర్శకుల ప్రశంసలు పొందింది. ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ ఈ సమ్మర్ రిలీజ్ కు రెడీగా ఉంది.
మరిన్ని సినీ సంగతులు…