భారత్ సమాచార్, అమరావతి ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 250కు మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారి అనుసంధానం చేయాలనే ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. దీంతో గ్రామీణ రహదారులకు మహర్ధశ ఏర్పడుతుందన్నారు. రూ.4,976 కోట్ల నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. మ్యాచింగ్ గ్రాంట్ 10 శాతానికి తగ్గించేలా కేంద్రంతో మాట్లాడతామని ఆయన అధికారులతో అన్నారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (AIIB) అధికారులు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంతో నిర్వహించిన సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ప్రణాళిక గురించి చర్చించారు.
జనసేన ఎంపీలకు దిశా నిర్దేశం…
రాష్ట్ర ప్రగతి కోసం, మానవ వనరుల అభివృద్ధి కోసం పార్లమెంటులో జనసేన పార్టీ తరపున చర్చించాలని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎంపీలకు సూచించారు. టెంపుల్ టూరిజం, ఏకో టూరిజంలపై దృష్టి సారించాలని ఆయన కోరారు. ప్రతి నెలా ఒక రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. ఎంపీలతో పాటు పార్టీ ఎమ్మెల్యేలంతా ఈ నిబంధన పాటించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా తనను కలిసేందుకు వచ్చే వారు కళ్లకు ఇంపుగా కనిపించేవి, కనులకు నిండుగా కనబడేవి కాదు, పది మంది కడుపు నింపేవి, పేదలకు ఉపయోగపడేవి తీసుకువస్తే బాగుంటుందని స్పష్టం చేశారు.