భారత్ సమాచార్, సినీ టాక్స్ : ఇండియాతో పాటుగా బిగ్ బాస్ ప్రపంచవ్యాప్తంగా కూడా వెరీ పాపులర్ రియాల్టీ షో. ఇండియాలో దీనికున్న క్రేజ్ మరే షోకు కూడా లేదనే చెప్పాలి. మన దేశంలోని అన్నీ భాషల్లో కెల్లా తెలుగు రాష్ట్రాల్లోనే ఈ షోకు యూత్ లో ఫుల్ గా క్రేజ్ ఏర్పడింది. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్… తెలుగు రియాల్టీ షో ప్రస్తుతం 7వ సీజన్ నడుస్తోంది. గత బిజినెస్ కంటే కూడా ఎక్కువగా ఈ షో ఆడియన్స్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో టీఆర్పీ రేటింగ్ కూడా భారీగా అద్దిరిపోతోంది. బిగ్ బాస్ రియాల్టీ షో ను సాధారణ గృహిణుల నుంచి వృద్ధుల దాక అందరూ చూస్తారు. హ్యుమన్ ఎమోషన్స్ మహిళలు, పెద్దలను ఆకట్టుకుంటే.. గ్లామర్ పరంగా యూత్ కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే ఈ షో పై విమర్శలు కూడా చాలా ఎక్కువే వస్తున్నాయి. ఇది టీనేజ్ పిల్లలను, యూత్ ని పక్కదారి పట్టిస్తోందని, ఈ రియాల్టీ షో ను అనుసరించే యూత్ అనైతిక కార్యకలాపాలకు అవకాశం ఉందని కొందరు బాహాటంగానే విమర్శిస్తుంటారు. అందులో సీపీఐ పార్టీ జాతీయ కార్యద్శి, సీనియర్ కమ్యూనిస్టు నారాయణ కూడా ముందుంటారు. ఈయన గతంలోనే చాలాసార్లు బాహాటంగానే విమర్శించారు. బిగ్ బాష్ రియాల్టీ షో ను ఆపేయాలని మీడియా వేదికగా డిమాండ్ కూడా చేశారు. వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగార్జునపై కూడా మండిపడ్డారు.
తాజాగా నారాయణ మరోసారి ఈ రియాల్టీ షో పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏం సంబంధం లేని 20,30 మంది ఆడ మగ ఇంట్లో ఉండడం ఏంటీ? దీనిని ఏమనాలి? బిగ్ బాస్ బ్రోతల్ హౌస్ లాంటిది కాక మరేంటి అని బాహాటంగానే ఫైర్ అయ్యారు. బిగ్ బాస్ అనైతికంగా అనిపించిందని. ఉద్దేశపూర్వకంగా తాను వ్యాఖ్యలు చేయడం లేదని అన్నారు. షోలో అశ్లీలత చాలా ఎక్కువగా ఉందన్నారు. టాస్క్ ల పేరిట అసభ్యకరమైన కంటెంట్ ను జనాల్లోకి వదులుతున్నారని మండిపడ్డారు.