Homemain slidesఅసలు రేవ్ పార్టీ అంటే ఏమిటి ?

అసలు రేవ్ పార్టీ అంటే ఏమిటి ?

భారత్ సమాచార్, జాతీయం ;

బెంగళూరు రేవ్ పార్టీ రైడ్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో దీని గురించి ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు మించి కూడా చర్చ సాగుతోంది. అసలు రేవ్ పార్టీ అంటే ఏమిటి? ఎప్పటి నుంచి ఈ కల్చర్ ఉంది. దీనిపై పోలీసులు ఎందుకు రైడ్ చేస్తారు వంటి విషయాలు తెలుసుకుందాం.

ఈ రేవ్ పార్టీ కల్చర్‌ 1950 లో మొదటగా ఇంగ్లండ్‌లో ప్రారంభమయినట్టుగా వార్తా కథనాలు చెబుతున్నాయి. ఆ తర్వాతే.. ఈ కల్చర్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. ఈ పార్టీలో తొలుత మ్యూజిక్‌, డ్యాన్స్‌ ను ఎంజాయ్‌ చేసేవారు. సంగీత కళాకారులు ఈ పార్టీల్లో ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆ తర్వాత ఈ పార్టీ కల్చర్‌ కొత్త రూపు సంతరించుకుంది. ఒక క్లోజుడ్‌ ప్రదేశంలో చెవులు పగిలిపోయే మ్యూజిక్‌ పెట్టుకుని మద్యం సేవిస్తూ.. పార్టీ చేసుకునే వారు.. వైల్డ్‌ బిహేవియర్‌తో చేసుకునే పార్టీలను ‘రేవ్‌’ అని పిలవడం మొదలుపెట్టారు. సాధారణంగా మద్యం సేవిస్తూ, డ్యాన్స్‌లు వేస్తూ పార్టీలు చేసుకోవడం వేరు.. ఈ రేవ్‌ పార్టీలు వేరు. ఈ రేవ్‌ పార్టీ అని పదం మొదట లండన్‌ లో పుట్టింది. రేవ్‌ పార్టీలో పాల్గొనే వారిని రేవర్స్‌ అని పిలుస్తారు. ప్రముఖ జాజ్ సంగీత విద్వాంసుడు మిక్ ముల్లిగాన్‌ ను “కింగ్ ఆఫ్ ది రేవర్స్” అని అంటారు.

క్రమక్రమంగా ఈ రేవ్‌ పార్టీ కల్చర్‌.. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు వేదికైంది. మద్యంతో పాటు అమ్మాయిల అశ్లీల నృత్యాలు చేయడమే కాకుండా.. యాంఫేటమిన్, ఎల్‌ఎస్‌డీ, కెటామైన్, మెథాంఫేటమిన్ , కొకైన్ , గంజాయి వంటి మాదకద్రవ్యాలు వాడటం పరిపాటిగా మారిపోయింది. ఇలాంటి చట్టవ్యతిరేక రేవ్‌ పార్టీలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందితే.. వెంటనే దాడి చేసి.. పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుని, నిర్వహకులను అరెస్ట్‌ చేస్తారు. ఈ పార్టీలతో డ్రగ్స్‌ వాడకం వివరీతంగా పెరగడంతోనే పోలీసులు ఈ రేవ్‌ పార్టీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా కూడా.. కొంతమంది సెలబ్రేటీలు ఈ రేవ్‌ పార్టీ కల్చర్‌ నుంచి బయటపడలేకపోతున్నారు.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

తెలుగు నటులు…కన్నడ పోలీసులు…ఓ రేవ్ పార్టీ

RELATED ARTICLES

Most Popular

Recent Comments