Homemain slidesశ్వేత పత్రం అంటే ఏంటి ?

శ్వేత పత్రం అంటే ఏంటి ?

భారత్ సమాచార్, జాతీయం ;

అనేక కీలక అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఇరుకున పెట్టేందుకు శ్వేతపత్రం విడుదల చేయాలని కొన్ని సార్లు ప్రతిపక్షాలు డిమాండు చేయడం మనం తరచుగా చూస్తుంటాం.
కొన్ని సార్లు ప్రజల కోసం ప్రభుత్వాలే శ్వేత పత్రాన్ని విడుదల చేస్తుంటాయి. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఈ ‘శ్వేతపత్రం’ అన్న మాట ఎక్కువగా వింటూ ఉంటాం. ఈ నేపథ్యంలో శ్వేతపత్రం అంటే ఏంటి? దాని చరిత్ర ఏమిటి? ప్రభుత్వం శ్వేతపత్రం ఎందుకు విడుదల చేస్తుంది. వీటి గురించి పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

శ్వేతపత్రం (వైట్‌పేపర్‌) అంటే ఏమిటి ?
దీన్ని ప్రభుత్వ విధాన ప్రకటనగా పేర్కొనవచ్చు. ప్రభుత్వం జారీ చేసే అధికారిక పత్రం అని కూడా చెప్పచ్చు. ఏదైనా ఒక సంక్లిష్టమైన అంశంపై ప్రభుత్వ వైఖరిని, విధానాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకు ఉద్దేశించిన అధికారిక నివేదిక/పత్రాన్ని శ్వేతపత్రం అని పిలుస్తారు.

ఏయే సందర్భాల్లో విడుదల చేస్తారు…

కొన్ని ప్రభుత్వాలు త్వరలో చేయబోయే చట్టాలకు సంబంధించి తమ ప్రతిపాదనల్ని ప్రజలకు వివరించేందుకు. కొన్ని సందర్భాల్లో ముసాయిదా బిల్లును చట్ట సభలోకి తెచ్చేందుకు. అప్పటికే ఉన్న ఒక చట్టంలో సవరణలు చేయాల్సి వచ్చినప్పుడు… వాటిపై ప్రజల్ని ముందే సమాయత్తం చేసేందుకు.కీలక అంశాలపై ప్రజల నుంచి స్పందన కోరేటప్పుడు. ఏదైనా ఒక అంశానికి సంబంధించిన వాస్తవాలు, గణాంకాలతో కూడిన సమాచారం వెల్లడికి శ్వేత పత్రాన్ని ప్రజల ముందు ఉంచుతారు.

ఏమిటి ప్రయోజనం…

వివాదాస్పద అంశాలపై ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకుని, తదనుగుణంగా విధాన నిర్ణయాల్లో ప్రభుత్వం మార్పులు చేయవచ్చు. ప్రభుత్వం చెప్పాలనుకున్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లవచ్చు. దీనికి మూలం ఎక్కడంటే శ్వేతపత్రం బ్రిటిష్‌ సంప్రదాయం. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం.. 1922లో బ్రిటన్‌ ప్రధాని “విన్‌స్టన్‌ చర్చిల్‌” తొలి శ్వేతపత్రం విడుదల చేసినట్లు చెబుతారు. అమెరికాలో వీటిని ‘బ్యాక్‌గ్రౌండ్‌ పేపర్స్‌’గా పిలుస్తారు.

శ్వేతపత్రాలతోపాటు, హరిత, నీలి పత్రాలూ వాడుకలో ఉన్నాయి.

హరితం

ఇవి కూడా ప్రభుత్వం విడుదల చేసేవే. ఇవి ఒక విధంగా సంప్రదిం పుల పత్రాలు. ఏదైనా ఒక అంశంపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవడానికి ముందు దానిపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడా నికి హరిత పత్రాల్ని విడుదల చేస్తాయి. కెనడాలో గ్రీన్ పేపర్ అధికా రిక ప్రభుత్వ పత్రం. బ్రిటన్ లో గ్రీన్ పేపర్స్ అధికారిక సంప్రదింపుల పత్రాలే.

నీలం

ఇది పూర్తిగా సాంకేతిక అంశాలకు సంబంధించినది. ఓ సాంకే తిక అంశం లేదా పరికరానికి సంబంధించిన పూర్తి వివరాల్ని తెలియజేసే పత్రాల్ని నీలిపత్రాలు (బ్లూ పేపర్స్) అని పిలుస్తారు. ఈ పదాన్ని మొదట జర్మనీలో ఉపయోగించారు. ఇప్పుడు ప్రపంచమంతా ప్రాచుర్యం పొందుతోంది.

పసుపు

ఇంకా అధికారి కంగా ఆమోదం పొందని, ప్రచురణకు సిద్దంగా ఉన్న పరిశో ధనా పత్రాన్ని పసుపు పత్రం (ఎల్లో పేపర్) అంటారు.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

వినియోగదారులు వాట్సాఫ్ లో ఫిర్యాదు చేయచ్చు

RELATED ARTICLES

Most Popular

Recent Comments