Homemain slides‘సలార్’... ‘డంకీ’ ఫైట్ లో విన్నర్ ఎవరో?

‘సలార్’… ‘డంకీ’ ఫైట్ లో విన్నర్ ఎవరో?

భారత్ సమాచార్, సినీ టాక్స్ : ఈసారి సంక్రాంతికి ముందే భారీ సినిమాలు రాబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందర్భంగా రెండు భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. రెండు వెయ్యి కోట్ల మార్కెట్ ఉన్న సినిమాలే కావడం విశేషం. అందులో ఒకటి ప్రభాస్ ‘సలార్’ కాగా.. రెండోది షారుఖ్ ఖాన్ ‘డంకీ’. ఈ రెండు సినిమాల్లో ఏది బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందో..చూడాలి. సినిమాలు ఎలా ఉన్నా భారీ ఓపెనింగ్స్ రావడం మాత్రం పక్కా. రెండు సినిమాల విశేషాలు చూద్దాం..

సలార్…
ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడూ వస్తుందా అని ఎదురుచూస్తున్న మూవీ ఇది. బహూబలితో ప్రభాస్, కేజీఎఫ్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు పాన్ ఇండియా లెవల్లో మారుమోగిపోయింది. ఇప్పడీ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సలార్ మూవీపై అంచనాలు మాములుగా లేవు. ఆ రెండు సినిమాలను మించి ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సలార్ ను రెండు భాగాలు విడుదల చేయనున్నారు. పార్ట్-1 డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ప్రభాస్ కు జోడిగా శ్రుతిహాసన్ నటిస్తున్నా ఈ చిత్రంలో.. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు నటిస్తున్నారు. రూ.400కోట్ల భారీ బడ్జెట్ తో హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. బహూబలి తర్వాత ప్రభాస్ కు ఒక్క సరైన హిట్ రాలేదు. ఇక దీంతోనైనా హిట్ ట్రాక్ లో పడాలని ప్రభాస్ భావిస్తున్నారు.

డంకీ…
సలార్ వంటి పక్కా మాస్ మసాలాకు పోటీగా ఫుల్లీ ఎమోషనల్ మూవీ డంకీ రానుంది. ఇలాంటి సినిమాల్లో ఎంతో అద్భుతంగా తెరకెక్కించే రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో.. ఎలాంటి ఎమోషనల్స్ నైనా ఇట్టే పలికించే షారుఖ్ కాంబినేషనల్ లో ఈ మూవీ వస్తోంది. షారుఖ్ కు జోడిగా తాప్సీ నటిస్తోంది. ఈ మూవీ డిసెంబర్ 21న థియేటర్లలోకి రానుంది. ‘‘ఇచ్చిన మాట కోసం ఓ సైనికుడు చేసే ప్రయాణం’’అనే క్యాప్షన్ ను మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఆ సైనికుడి ఫ్రెండ్స్ కు ఏ ఆపద వచ్చింది.. దాన్ని హీరో ఎలా అధిగమించాడు..? అనేదే స్టోరీ లైన్. ఈ ఏడాదిని షారుఖ్ జీవిత కాలం గుర్తుంచుకుంటాడు. ఇప్పటికే ఆయన రెండు చిత్రాలు పఠాన్, జవాన్ .. బ్లాక్ బస్టర్లు గా నిలిచి రెండూ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాయి. తాజాగా డంకీతో హ్యాట్రిక్ కొట్టాలని షారుఖ్ భావిస్తున్నారు.

మరికొన్ని కథనాలు…

RELATED ARTICLES

Most Popular

Recent Comments