Homebreaking updates newsఓరి రాములా ఎంత పని చేసింది..?

ఓరి రాములా ఎంత పని చేసింది..?

భారత్ సమాచార్.నెట్, భద్రాద్రి కొత్తగూడెం: వివాహేతర సంబంధంకు అడ్డుగా ఉన్నాడని తన బావతో కలిసి మద్యం సీసాలో పాయిజన్ కలిపి కట్టుకున్న భర్తను హతమార్చింది భార్య. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలోని పేట చెరువు గ్రామంలో బుట్టల నరేష్ ఫిబ్రవరి 10న మద్యం సేవించిన అనంతరం.. వాంతులు అవడంతో కుటుంబ సభ్యులు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి ఇంటికి తీసుకుని వచ్చారు.. అనంతరం మరుసటి రోజు కూడా వాంతులు అయి మృతి చెందాడు. ఆపై కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
బుట్టల నరేష్ తెచ్చుకున్న మద్యం సీసాలో మిగిలి ఉన్న సగం మందు.. దినకర్మల రోజు మృతుడికి వరసకు బావ అయిన వ్యక్తి సేవించి అతను కూడా వాంతులు అయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో బంధువులు అతన్ని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.. పరీక్షించిన వైద్యులు ఆ మందు సీసాలో పాయిజన్ కలిసిందని తెలపడంతో మృతుడి తల్లి చుట్టమ్మ పాల్వంచ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమదైన స్టైల్లో కేసు విచారణ చేసిన పోలీసులకు కొత్త కొత్త విషయాలు తెలిశాయి.
తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మద్యం అలవాటు ఉన్న తన భర్తను ఎవరికి అనుమానం రాకుండా హతమార్చింది భార్య.  కానీ మృతుడికి వరసకు బావైన వ్యక్తి.. ఆ మిగిలిన లిక్కర్ తాగి.. అనారోగ్యం పాలవ్వడంతో.. ఎక్కడో తేడా కొట్టింది. మృతుడి తల్లి పోలీసులను ఆశ్రయించడంతో… విచారణలో ఈ వివాహేతర సంబంధం వెలుగుచూసింది పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ తెలిపారు.. బుట్టల నరేష్‌ను పథకం ప్రకారం చంపిన ఘటనలో పినపాక మండలం ఉప్పాక గ్రామానికి చెందిన గద్దల సాంబశివరావు.. అతడికి సహకరించిన వెంకటాపురం గ్రామం ములుగు జిల్లాకు చెందిన తాటి నరేష్, మృతుడి భార్య బుట్టల రజితను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments