Homebreaking updates newsకేటీఆర్ కు ధీటైన ఐటీ మంత్రి వస్తారా?

కేటీఆర్ కు ధీటైన ఐటీ మంత్రి వస్తారా?

భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణ సీఎంగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని ఎంపిక చేసింది. ఇక మిగతా మంత్రుల శాఖపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. హోంమినిస్టర్ వీరు.. భారీ నీటిపారుదల శాక వీరు.. అంటూ పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అన్నింటికీ ప్రధానంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ఎవరవుతారు? అనే విషయంపై నెటిజన్లు ఎక్కువగా చర్చ పెడుతున్నారు.

తెలంగాణ ప్రధాన ఆదాయం ఐటీ ఇతర సేవల రంగం నుంచే వస్తోంది. ఫార్మా, ఇతర పరిశ్రమల నుంచి ఆదాయం బాగానే వస్తోంది. ఈ రంగాల్లో దేశంలోనే అగ్రరాష్ట్రంగా తెలంగాణ కొనసాగుతోంది. ఐటీలోనైతే దేశంలోనే టాప్ స్టేట్ గా కొనసాగుతోంది. కేటీఆర్ దార్శనికతతో ఐటీలో బెంగళూరుతో సమానంగా రాణిస్తోంది. ఐటీ ఉపాధిలో బెంగళూరును మించిపోయింది అంటారు. మిగతా అన్ని రంగాల కంటే రాష్ట్ర భవిష్యత్ ను శాసిస్తున్న ఐటీ, పరిశ్రమలను కేటీఆర్ లాగా సమర్థంగా నడుపగలిగే సత్తా ఉన్నా నాయకుడు కాంగ్రెస్ లో ఎవరున్నారు? అని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ ను ప్రపంచ వేదికపై నిలిపిన ఘనత కేటీఆర్ కే దక్కుతుందని ఐటీ జనాలు అంటున్నారు. చంద్రబాబు హయాంలో అడుగులు పడిన ఈ రంగం, వైఎస్ హయాంలో నడక నేర్చింది. కేటీఆర్ హయాంలో పరుగులు పెట్టి నంబర్ వన్ స్టేజ్ లో నిలిచిందన్నది వాస్తవం. మన రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.17లక్షలు ఉందంటే కారణం ఐటీ, సేవల రంగంలోని ఆదాయం ద్వారానే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ శాఖను కేటీఆర్ లాగా సమర్థంగా నడపగలిగే వ్యక్తికే ఇవ్వాలని ఐటీ జనాలు సూచిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఐటీ శాఖను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ఇవ్వనున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈయనకు సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్నాయని, వాటిపై పట్టు ఉందని అంటున్నారు. చూడాలి మరి మదన్ మోహన్ రావు ఐటీ శాఖను తీసుకుని తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుంటారా? కేటీఆర్ లాగా ఆ శాఖను ముందుకు తీసుకెళ్తారా? అనే వేచి చూడాల్సిందే.

మరికొన్ని కథనాలు…

RELATED ARTICLES

Most Popular

Recent Comments