భారత్ సమాచార్, క్రీడలు : మన కుర్రాళ్లు కంగారులు ఆస్ట్రేలియాతో అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ లో బిగ్ ఫైట్ చేయటానికి ఈ ఆదివారం రెడీ అయిపోయారు. దక్షిణాఫ్రికాలోని బెనోనీ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా నేడు ఫైనల్ మ్యాచ్ లో తలపడనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. ఈ అండర్-19 తుదిపోరుకు యంగ్ భారత్ వరుసగా ఐదోసారి ఫైనల్ కు చేరటం మరో విశేషం. కంగారు ఆటగాళ్లు ఈ ఫైనల్స్ కి చేరటం ఇది నాలుగోసారి.
ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో ప్రసారం కానుంది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ మ్యాచ్ ఉచితంనుగా లైవ్ స్ట్రీమింగ్ అవ్వనుంది.
వాటికి సమాధానం ఇవ్వాలి
గత ఏడాది ఆస్ట్రేలియాతో వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ లో జరిగిన పరాభవాన్ని క్రికెట్ ప్రేమికులు ఇప్పటికీ మర్చిపోలేదు. అలాగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ లోనూ ఆస్ట్రేలియాతో చేతిలో టీంఇండియా కంగుతిన్న విషయం క్రీడాభిమానులకు అందరికి తెలిసిందే. వీటికి నేడు మన యంగ్ టీంఇండియా సరైన సమాధానం ఇవ్వాలని క్రికెట్ అభిమానులు అందరూ కోరుకుంటున్నారు. మరి ఈ బిగ్ ఫైట్ లో విజేత ఎవరో తెేలాలంటే ఈ ఆదివారం వరకూ ఎదురు చూడాల్సిందే. టీంఇండియా బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో కూడా మంచి ఫామ్ లో ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా టీం కూడా తమ ఫామ్ ను కొనసాగిస్తోంది.
జట్ల వివరాలు
భారత్: ఉదయ్ సహరన్ (కెప్టెన్), అర్ణిష్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్,
రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాన్షు మోలియా, ముషీర్ ఖాన్,
అరవెల్లి అవనీశ్ రావు (వికెట్ కీపర్), సౌమ్య్ కుమార్ పాండే (వైస్ కెప్టెన్),
ఇన్నేశ్ మహరాజన్ (వికెట్ కీపర్), మురుగున్ అభిషేక్, ధనుష్ గౌడ,
ఆరాధ్య శుక్లా, రాజ్ లింబానీ, నమన్ తివారీ
ఆస్ట్రేలియా: హుజ్ వెబ్‍గెన్ (కెప్టెన్), చార్లీ ఆండర్సన్, లచ్లన్ ఐట్కెన్,
హార్కియాత్ బాజ్వా, మహిల్ బియర్డ్ మ్యాన్, టామ్ చాంప్‍బెల్,
హ్యారీ డిక్సాన్, ర్యాన్ హిక్స్ (వికెట్ కీపర్), సామ్ కొన్‍స్టాట్స్,
రఫేల్ మ్యాక్‍మిలాన్, ఐజాన్ ఓకొన్నోర్, హర్జస్ సింగ్, టామ్ స్ట్రేకర్,
కాలమ్ విడ్లెర్, ఓలీ పీక్