Date and Time

Email : bharathsamachar123@gmail.com

ప్రియుడి మోజులో పడి ఏం చేసిందంటే..!

భారత్ సమాచార్.నెట్, నల్గొండ: ప్రియుడి మోజులో పడి భర్తలను చంపుతున్న ఘటనలు కొన్నైతే, కన్నబిడ్డలను వదిలేసిన ఘటనలు మరికొన్ని. ప్రియుడు తనవెంట రమ్మని చెప్పడంతో కన్నబిడ్డను బస్టాండ్‌లో వదిలేసిన ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించింది. నల్గొండ బస్‌స్టాండ్‌లో మానవత్వం లేని ఓ తల్లి తన బిడ్డను వదిలి వెళ్లింది. అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలియక బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్న 15 నెలల చిన్నోడిని గమనించిన ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు వారు వచ్చి సీసీ కెమెరాల ఆధారంగా ముందు తల్లి ఆనవాలు గుర్తించారు. ఆమె భర్తను పిలిపించి.. బిడ్డను ఆయనకు అప్పగించారు.

ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. బిడ్డను వదిలి ప్రియుడితో జంప్:
నల్గొండ పట్టణంలోని పాతబస్తీకి చెందిన ఓ యువకుడితో.. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వివాహితకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఆమెకు భర్త, 15నెలల బాబు ఉన్నారు. వారిని వదిలేసి మహిళ ప్రియుడితో వెళ్లిపోవాలనుకుంది. డైరెక్ట్‌గా నల్గొండ ఆర్టీసీ బస్టాండ్‌కు బాబుతోపాటు వచ్చి.. చిన్నోడిని అక్కడే వదిలేసి ఆ యువకుడితో జంప్ అయింది. బాబు తప్పిపోయాడన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. బస్టాండ్‌లోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు బైక్ మీద వెళుతున్న మహిళ వీడియోను గమనించి ఆ బాలుడు తన తల్లిని గుర్తించాడని పోలీసులు తెలిపారు. విచారణ చేయగా.. వారి ఇన్ స్టా లవ్ స్టోరీ బయపడడం పోలీసులు కంగు తిన్నారు. మహిళను, ఆమె ఇన్ స్టాగ్రామ్ ప్రేమికుడిని, ఆమె భర్తను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.

మరిన్ని కథనాలు:

ప్రియుడి మోజులో పడి.. భర్తను కడతేర్చి

Share This Post