Homebreaking updates newsనారీ న్యాయం గ్యారంటీ...

నారీ న్యాయం గ్యారంటీ…

భారత్ సమాచార్, రాజకీయం : ఆరు గ్యారంటీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల కోసం మరో గ్యారంటీని ప్రకటించింది. స్త్రీల ఓట్లను టార్గెంట్ చేస్తూ నారీ న్యాయం గ్యారంటీని దేశ వ్యాప్తంగా నేడు ప్రకటించింది. స్ట్రీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అన్ని రంగాల్లో వారికి ఎక్కువ అవకాశాలు కల్పించాడానికి వీటిని ప్రకటించింది. వీడి ద్వారా ఎలాగైనా కేంద్రంలో అధికారంలోకి రాాావాలని గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఇప్పుడు వాటి వివరాలు  తెలుసుకుందాం.

మహాలక్ష్మి: పేద కుటుంబానికి చెందిన ప్రతీ మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు. రేషన్ కార్డు ఉన్న ప్రతి పేద కుంటుంబానికి ప్రతి మహిళకు లేదా కుంటుంబానికి ఏడాదికి లక్ష రూపాయాలు మహాలక్ష్మి పథకం ద్వారా అందించనుంది. దీని ద్వారా దారిద్రవ్య రేఖకు దిగువున బ్రతుకుతున్న వారికి ఎంతో కొంత ఊరట కలగనున్నది.

సగం జనాభా, పూర్తి హక్కులు: కేంద్ర ప్రభుత్వంలో కొత్త నియామకాల్లో సగభాగం మహిళలకు కేటాయించబడుతుంది.

ఇప్పటి వరకు సాయుధ బలగాలలో కేవలం పురుషులు మాత్రమే ఉన్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే త్రివిధ దళాలల్లో పురుషులతో సమానంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నది. ఇప్పటికే బీజేపీ కూడా మహిళలకు కేంద్ర బలగాలల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.

శక్తి గౌరవం: ఆశా, అంగన్‌వాడీ మరియు మధ్యాహ్న భోజనం తయారు చేసే మహిళలకు నెలవారీ జీతంలో కేంద్ర ప్రభుత్వ సహకారం రెట్టింపు అవుతుంది. అయితే ఇప్పటి వరకు వీరికి కేవలం రాష్ట్ర ప్రభుత్వాలే జీతాలు చెల్లిస్తున్నాయి. శక్తి గౌరవం పేరుతో కేంద్ర నుంచి కూడా నిధులు ఇవ్వునున్నది.

హక్కుల మైత్రి: ప్రతి పంచాయతీ హక్కుల మైత్రిని నియమిస్తుంది. మహిళలకు వారి చట్టపరమైన హక్కుల గురించి తెలియజేస్తుంది. హక్కులను అమలు చేయడంలో సహాయపడుతుంది.

సావిత్రి బాయి ఫూలే హాస్టల్: కేంద్ర ప్రభుత్వం దేశంలోని వర్కింగ్ ఉమెన్ కోసం హాస్టల్‌ల సంఖ్యను రెట్టింపు చేస్తుంది. ప్రతి జిల్లాలో కనీసం ఒక హాస్టల్ ఏర్పాటు చేస్తుంది.

మరికొన్ని రాజకీయ కథనాలు…

“మోదీ గ్యారెంటీ – ఈటల షూరిటీ”

RELATED ARTICLES

Most Popular

Recent Comments