Homemain slidesయాత్ర-2 సినిమా టీజర్ విడుదల..మరో పొలిటికల్ డ్రామా

యాత్ర-2 సినిమా టీజర్ విడుదల..మరో పొలిటికల్ డ్రామా

భారత్ సమాచార్, సినీ టాక్స్ : ఉమ్మడి ఏపీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2019లో విడుదలైంది. ఈమూవీలో వైఎస్ పాత్రను మమ్ముట్టి పోషించారు. ఈ చిత్రానికి మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఇదే కాంబినేషన్ లో యాత్ర-2 అనే సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో వైఎస్ జగన్ పాత్రను తమిళ నటుడు జీవా పోషిస్తున్నారు.

వైఎస్ మరణం, ఆ తర్వాత జగన్ ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2019 ఎన్నికలకు ముందు జగన్ చేసిన సుదీర్ఘ పాదయాత్ర, ఎన్నికల్లో గెలుపు సాధించిన కథాంశాలతో యాత్ర-2 మూవీ వస్తోంది. ఈ మూవీని ఫిబ్రవరి 8న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కాగా, ఇవాళ(జనవరి 5) యాత్ర-2 టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. 2.46 నిమిషాల నిడివున్న ఈ టీజర్ వైఎస్ జగన్ అభిమానులను, వైసీపీ క్యాడర్ ను అలరిస్తోంది. ఇందులో జగన్ పై చంద్రబాబు, సోనియా కుట్రలు చేసినట్టుగా చూపించారు. జగన్ ను హీరోగా ప్రజానాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తూ సినిమాటిక్ డ్రామా అల్లినట్టు తెలుస్తోంది.

ఈ మూవీలో వైఎస్ భారతిగా కేతకి నారాయణ్, సోనియా గాంధీ పాత్రలో జర్మనీ నటి సుజానే బెర్నెట్ నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో మహేశ్ మంజ్రేకర్, రాజీవ్ కుమార్ అనేజా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తుననారు. వీ సెల్యూలాయిడ్, త్రీ ఆటమ్ లీవ్స్ పతాకాలపై శివ మేకల, మహి వి. రాఘవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మరికొన్ని సినీ కథనాలు…

మెగా డాటర్‌కు జగన్ సర్కార్ షాక్

RELATED ARTICLES

Most Popular

Recent Comments