భారత్ సమాచార్, ఫిలాసఫీ ;
డబ్బుతో ఏమైనా
కొనగలమనుకుంటున్నారా…
అయితే కొనలేనివి ఇవిగో
మంచం పరుపు కొనవచ్చు
కానీ నిద్ర కాదు
గడియారం కొనవచ్చు
కానీ కాలం కాదు
మందులు కొనవచ్చు
కానీ ఆరోగ్యం కాదు
భవంతులు కొనవచ్చు
కానీ ఆత్మీయత కాదు
పుస్తకాలు కొనవచ్చు
కానీ జ్ఞానం కాదు
పంచభక్ష పరమాన్నాలు కొనవచ్చు
కానీ జీర్ణశక్తిని కాదు
ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే
అందరి కన్నా ముందు మేకలే జ్ఞానులు
కావాలి,
స్నానాలతోనే పాపాలు పోతే ముందు
చేపలే పాప విముక్తులు కావాలి,
తలక్రిందులుగా తపస్సు చేస్తేనే
పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు
గబ్బిలాలకే ఆ వరం దక్కాలి,
ఈ విశ్వమంతా ఆత్మలో ఉంది
నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ
పరుగులు పెడితే ప్రయోజనమే లేదు,
నీలో లేనిది బయటేమీ లేదు
బయట ఉన్నదంతా నీలోనూ ఉంది
తెలిసి మసులుకో — కలిసి జీవించు…..
(వాట్సాఫ్ యూనివర్శిటీ నుంచి సేకరణ )