Homemain slidesవైన్ లోనే డి‘వైన్’.. ఆ కిక్కే వేరప్పా

వైన్ లోనే డి‘వైన్’.. ఆ కిక్కే వేరప్పా

భారత్ సమాచార్, అంతర్జాతీయం : వెనకటి రోజుల్లో తాటికల్లు, ఈతకల్లు లేదంటే ఏదో మోటు విస్కీ బ్రాండో తాగేవారు. కానీ కాలం మారుతున్న కొద్ది జనాలు తాగడంలో బ్రాండ్ మెయింటేన్ చేస్తున్నారు. కొందరు బీర్ అంటే మరికొందరు విస్కీ, ఇంకొందరు వైన్, వొడ్కా.. అని తమ ఆప్షన్ చెప్తుంటారు. అయితే ఇప్పుడు దేశంలో వైన్ తాగడం ఓ ఫ్యాషన్ అయ్యింది. ఆడ, మగ తేడా లేకుండా వైన్ తాగుతున్నారు. వైన్ లో వైట్ వైన్, రెడ్ వైన్ అనే రకాలు ఉంటాయి. ఒక్కొక్క దానిలో ఒక్కో ప్రయోజనం, రుచి, అల్కహల్ మోతాదు ఉంటుంది. అవెంటో చూద్దాం..

వైట్ వైన్ ప్రధానంగా తెల్లద్రాక్ష నుంచి తయారుచేస్తారు. కిణ్వణ ప్రక్రియకు ముందు తొక్కను రసం నుంచి వేరు చేస్తారు. రెడ్ వైన్ ముదురు ఎరుపు లేదా నలుపు ద్రాక్ష నుంచి తయారుచేస్తారు. ద్రాక్షను చూర్ణం చేసి రసం తీసి తర్వాత ఆ రసాన్ని పులియబెడుతారు. ఈ ప్రక్రియలో పిండి చేసిన ద్రాక్ష విత్తనాలు రసం నుంచి తీసివేయరు.

ద్రాక్షను ఎంచుకుని వైన్ తయారీకి పంపుతారు. రెడ్ వైన్ కోసం ద్రాక్ష తొక్కలు, విత్తనాలతో పాటు పులియబెడుతారు. ఇక వైట్ వైన్ లో తొక్కలు, విత్తనాలను పులియబెట్టరు. రెడ్ వైన్ యొక్క రంగు ద్రాక్ష చర్మం, దాని గింజల నుంచే వస్తుంది.

రెడ్ వైన్ ప్రత్యేకత దాని రుచి. దీన్ని దాని సాఫ్ట్, రిచ్, వెల్వెట్ రుచి కోసం ఇష్టపడుతుంటారు. వైట్ వైన్ కు రుచి దాని పండు వల్ల కాస్త పుల్లగా ఉంటుంది. ఈ రుచులను తీసుకురావడానికి వేర్వేరు పద్ధతుల్లో తయారు చేస్తారు.

సాధారణంగా రెడ్ వైన్.. వైట్ వైట్ కన్నా ఎక్కువ కిక్ ఇస్తుంది. రెడ్ వైన్ లో ఆల్కహల్ కంటెంట్. 11-15శాతం ఉంటుంది. వైట్ వైన్ లో 9-13శాతం ఉంటుంది. కొన్ని ప్రత్యేక రకాల రెడ్ వైన్ లలో ఆల్కహల్ కంటెంట్ 25 శాతం దాకా ఉంటుంది. రెడ్ వైన్ లో కిక్ ఎక్కువ కాబట్టి చాలా మంది అది తాగడానికే ఇష్టపడుతుంటారు.

మరికొన్ని ప్రత్యేక కథనాలు

12 రోజుల పాటు ట్రాఫిక్ జామ్..ఎక్కడో తెలుసా?

RELATED ARTICLES

Most Popular

Recent Comments