భారత్ సమాచార్, అంతర్జాతీయం : ట్రాఫిక్ జామ్ లు మన దేశ ప్రముఖ నగరాల్లోని ప్రజలకి కొత్తేం కాదు..మన హైదరాబాద్ లోనూ, అలాగే బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ.. ఇలా ఏ నగరం తీసుకున్న ట్రాఫిక్ జాములతో ఉన్న ఇబ్బందులు తక్కువేం కాదు. అయితే మన దేశ ప్రధాన నగరాల్లోని ట్రాఫిక్ జాంలు గంటో లేదా రెండు, మూడు ఇంకా మహా అయితే నాలుగు గంటలో ఉంటాయి. కానీ ప్రపంచంలోనే 12 రోజుల పాటు ట్రాఫిక్ జామ్ అయ్యిందని మీకు తెలుసా? అమ్మో 12 రోజులే అని ఆశ్చర్యపోతున్నారు కదా? అంటే ఆ 12 రోజులు తిండి, తిఖానా అంతా రోడ్లపైనే.. మరి వాళ్ల కష్టాలు ఎవరికీ చెప్పుకోవాలి. వాళ్ల కష్టాల ముందు మన ట్రాఫిక్ ఇక్కట్లు చాలా లైట్ తీసుకోవాలి అనుకోవాల్సిందే కదా…
ఇంత ఘోరమైన ట్రాఫిక్ జామ్ 2010వ సవంత్సరం ఆగస్టు 14.. చైనా రాజధాని బీజింగ్ లో జరిగింది. ఆ ట్రాఫిక్ జాం 100 కిలోమీటర్లకు పైగా 12 రోజులపాటు ఈ ట్రాఫిక్ జాం కొనసాగింది. ఈ ట్రాఫిక్ జాంలో వేలాది కార్లు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. డ్రైవర్లు తమ కార్లను ప్రతీ రోజూ 1కి.మీ మాత్రమే కదిలించగలిగారు. కొంతమంది డ్రైవర్లు వరుసగా 5,6 రోజుల పాటు ట్రాఫిక్ లోనే చిక్కుకున్నారు.
అసలీ ట్రాఫిక్ జామ్ ఎందుకు అయ్యిందంటే.. బీజింగ్ సమీపంలో ఉన్న బీజింగ్-టిబెట్ హైవేలో కొంత భాగంలో రిపేర్లు నడుస్తున్నాయి. అలాగే ఆ హైవేపై భారీ ట్రక్కులు 50 శాతం రహదారిని ఆక్రమించాయి. దీంతో చిన్నగా ట్రాఫిక్ జాం ఏర్పడి వరుసగా 100 కి.మీ దాక విస్తరించింది. ఇక వాహనాల కదలికలు మరీ స్లో అయిపోయాయి.
సమస్య పరిష్కారానికి చైనా అధికారులు తీవ్రంగా కృషి చేశారు. ప్రస్తుత ట్రాఫిక్ జామ్ క్లియర్ అయ్యేంత వరకు ఇతర వాహనాలను ఆ రోడ్డుపైకి రానివ్వలేదు. భారీ ట్రక్కులను పంపించవద్దని కంపెనీలకు ఆదేశాలు ఇచ్చారు. వందలాది మంది సిబ్బంది, అధికారులు రాత్రింబవళ్లు రోడ్డు పొడవునా ఉండి చివరకు 12 రోజుల తర్వాత క్లియర్ చేయగలిగారు.
















